Provident Fund | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO - ఈపీఎఫ్‌వో ) తాజాగా తీపికబురు అందించింది. కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. మెంబర్ పోర్టల్‌లో ఆన్‌లైన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంచింది. జాయింట్ ఆప్షన్ కింద అధిక పెన్షన్ పొందాలని భావించే వారు ఈ ఆన్‌లైన్ సర్వీసులు ఉపయోగించుకోవచ్చు. 2014 సెప్టెంబర్ 1 కన్నా ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఈ జాయింట్ ఆప్షన్ ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. దీని ద్వారా అధిక పెన్షన్ (Pension) పొందొచ్చు. అప్లికేషన్లను సమర్పించొచ్చు.
అధిక పెన్షన్ అంశానికి సంబంధించి దేశీ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈపీఎఫ్‌వో ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇప్పుడు అధిక పెన్షన్ కోరుకునే వారు ఆన్‌లైన్‌లోనే పీఎఫ్ వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ సమర్పించొచ్చు. దీని వల్ల ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా అప్లికేషన్ సబ్‌మిట్ చేయొచ్చు.
రూ.1,700కే విమాన టికెట్.. రిపబ్లిక్ డే ఆఫర్ అదుర్స్!
సుప్రీం కోర్టు తన 2022 నవంబర్ నెల ఆదేశాలను గమనిస్తే.. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అధిక పెన్షన్ పొందటానికి సబ్‌స్క్రైబర్లకు మరో అవకాశం కల్పించింది. అధిక పెన్షన్ పొందే ఆప్షన్ అందుబాటులో ఉంచింది. 2014 సెప్టెంబర్ 1 నాటికి ఈపీఎస్ సభ్యలుగా ఉన్న ఎంప్లాయీస్ పెన్షన్ కోసం పరిమితి విధించిన శాలరీలో 8.33 శాతం కాకుండా వాస్తవిక శాలరీలో 8.33 శాతం కంట్రిబ్యూట్ చేయొచ్చని తెలియజేసింది.
ఈ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న వారికి భారీ శుభవార్త!
ఇకపోతే ఉద్యోగులు వారి పెన్షన్ పేమెంట్ ఆర్డర్, ఆధార్ నెంబర్ , పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను అప్లికేషన్ ఫామ్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్‌వో రికార్డుల్లో ఉన్న వివరాలను మాత్రమే ఎంటర్ చేయాలి. అలాగే యూఐడీఏఐతో అనుసంధానం అయిన మొబైల్ నెంబర్‌ను కచ్చితంగా కలిగి ఉండాలి. అయితే ఈ కొత్త సర్వీసులు సరిగా పనిచేయడం లేదని నివేదికలు పేర్కొంటున్నాయి. పేరు యాడ్ చేయాలని భావిస్తే.. కావడం లేదని తెలుస్తోంది. అందుకే ఈపీఎఫ్‌వో కొత్త అప్‌డేట్ వెర్షన్‌ను తీసుకురావొచ్చు. మార్చి 3 వరకు అప్లికేషన్స్ సమర్పించడానికి గడువు ఉంది.
కాగా మరోవైపు ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్ తన సబ్‌స్క్రైబర్లకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. సర్వీసులు సరిగా లేవని సబ్‌స్క్రైబర్లు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. పీఎఫ్ పాస్ బుక్ చెక్ చేసుకోకపోతున్నామని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఈపీఎఫ్‌వో పీఎఫ్ పాస్ బుక్ చెకింగ్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. పీఎఫ్ ఖాతాదారులు సులభంగానే ఇప్పుడు వారి పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మిస్డ్ కాల్, ఉమాండ్ యాప్, పీఎఫ్ వెబ్‌సైట్ ద్వారా మీరు ఈ పని పూర్తి చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Employees Provident Fund Organisation, Epf, EPFO, Pensions, PF account, Pf balance