EPFO | పీఎఫ్ ఖాతాల్లోకి చేరిన వడ్డీ.. ఇలా చెక్ చేసుకోండి..

EPFO : దీపావళి వేళ ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందజేసింది. 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ ఖాతాదారులకు 8.65 శాతం వడ్డీ జమ అయింది. ఇప్పటికే చాలా మందికి ఈ వడ్డీ జమ అయినట్లు సందేశాలు వస్తున్నాయి.

news18-telugu
Updated: October 18, 2019, 2:16 PM IST
EPFO | పీఎఫ్ ఖాతాల్లోకి చేరిన వడ్డీ.. ఇలా చెక్ చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దీపావళి వేళ ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందజేసింది. 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ ఖాతాదారులకు 8.65 శాతం వడ్డీ జమ అయింది. ఇప్పటికే చాలా మందికి ఈ వడ్డీ జమ అయినట్లు సందేశాలు వస్తున్నాయి. ఉద్యోగుల భవిష్య నిధిపై వడ్డీ రేటు పెంపునకు కేంద్రం ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ పెంపుతో దాదాపు 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం చేకూరింది. వాస్తవానికి ఈ వడ్డీ గత ఫిబ్రవరిలోనే జమ కావాల్సి ఉంది. కానీ, కేంద్ర ఆర్థిక శాఖ దీనికి ఆలస్యంగా ఆమోదం తెలపడంతో ప్రస్తుతం ఆ మొత్తం జమ అవుతోంది. అయితే, ఆలస్యం వల్ల ఖాతాదారులకు ఎలాంటి అదనపు మొత్తం అందబోదు. ఇదిలా ఉండగా, పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను ఎలా తెలుసుకోవడానికి UMANG యాప్, SMS, EPF పోర్టల్ లేదా Missed Call ద్వారా పీఎఫ్ అకౌంట్లలో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు.

ఇలా చెక్ చేసుకోవచ్చు..

మెసేజ్ ద్వారా..

  • మీ రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 77382 99899కు ఎస్సెమ్మెస్ చేయాలి.

  • మీరు పంపే మెసేజ్ EPFOHO UAN టైప్ చేసి ఎస్సెమ్మెస్ చేయాలి.

  • మీ యూఏఎన్ అకౌంట్ మీ కేవైసీ వివరాలకు లింక్ అయి ఉండాలి.


  • యునైటెడ్ పోర్టల్‌‌పై రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి మాత్రమే ఎస్సెమ్మెస్ పంపాలి.


UMANG యాప్ ద్వారా..

  • ఈ యాప్‌ను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • యాప్ ఓపెన్ చేసి మీ UAN అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి.

  • మీ యూఏఎన్ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

  • ఓటీపీ నంబర్‌ను ఎంటర్ చేస్తే చాలు.. మీ పీఎఫ్ బ్యాలెన్స్‌కు సంబంధించి వివరాలను తెలుసుకోవచ్చు.


EPF పోర్టల్ ద్వారా..

  • www.epfindia.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

  • అవర్ సర్వీసెస్ కింద ‘ఫర్ ఎంప్లాయీస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

  • ఇక్కడ మెంబర్ పాస్‌బుక్ అనే బటన్ పై క్లిక్ చేయాలి.

  • మీ యూఏఎన్ యూజర్ పేరు, పాస్‌వర్డ్ తో లాగిన్ కావాలి.

  • ఈపీఎఫ్ పాస్‌బుక్ స్ర్కీన్ ఓపెన్ చేయగానే బ్యాలెన్స్ కనిపిస్తుంది.


మిస్స్‌డ్ కాల్ ఇవ్వడం ద్వారా..

  • రిజిస్టర్ మొబైల్ నుంచి 011-22901406కు మిస్ కాల్ ఇవ్వాలి.

  • ఈ కాల్ కు ఎలాంటి చార్జీ ఉండదు.

  • కాల్ ఆగిపోయిన కొద్దిక్షణాల్లో మీ మొబైల్‌కు ఎస్సెమ్మెస్ రూపంలో పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు వస్తాయి.

Published by: Shravan Kumar Bommakanti
First published: October 18, 2019, 1:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading