ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వడ్డీని 2021 జనవరి 1 నుంచే జమ చేస్తున్నట్టు కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రకటించారు. మొదట ఈ వడ్డీని రెండు విడతల్లో జమ చేస్తారన్న వార్తలొచ్చాయి. కానీ ఈక్విటీ మార్కెట్లో ఈపీఎఫ్ఓ పెట్టుబడులకు భారీగా లాభాలు రావడంతో ఈపీఎఫ్ ఖాతాదారులకు వడ్డీని ఒకే విడతలో చెల్లించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయించింది. ఈ మేరకు ఈపీఎఫ్ అకౌంట్లలో జనవరి 1 నుంచి వడ్డీ జమ చేస్తోంది ఈపీఎఫ్ఓ.
దీపావళి నాటికే ఈపీఎఫ్ వడ్డీ జమ అవుతుందన్న వార్తలొచ్చాయి. కానీ పలు కారణాల వల్ల వడ్డీ జమ చేయడం ఆలస్యమైంది. దీపావళి గిఫ్ట్ కాస్తా న్యూ ఇయర్ గిఫ్ట్‌గా మారింది. కాస్త ఆలస్యమైనా ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు ఇది తీపికబురే. కొత్త సంవత్సరంలో ఈపీఎఫ్ అకౌంట్లోకి డబ్బులు జమ కాబోతున్నాయి. ఈపీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లలో వడ్డీ జమ అయిందో లేదో తెలుసుకోవడానికి ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్, ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా ఖాతాదారులు తమ ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు.
EPFO Benefits: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈ 4 ప్రయోజనాలు మిస్ కావొద్దు
EPF Withdrawal: పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే నష్టమే
EPFO सब्सक्राइबर्स को वर्ष 2019 - 2020 के लिए ब्याज दर 8.5 % प्रदान किया गया।
नव वर्ष सभी देशवासियों के लिए मंगलमय हो। pic.twitter.com/IXmHfR3Yd3
— Santosh Gangwar (@santoshgangwar) December 31, 2020
Missed Call: మిస్డ్ కాల్ ద్వారా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్ఓ ప్రత్యేకంగా ఓ ఫోన్ నెంబర్ కేటాయించింది. 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా తెలుస్తాయి. అయితే ఇందుకోసం ఖాతాదారులు ముందుగా తమ మొబైల్ నెంబర్‌ను యూఏఎన్ అకౌంట్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది.
SMS: ఒక్క ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం సులువే. ఇందుకోసం కూడా ఈపీఎఫ్ఓ ప్రత్యేకంగా ఓ మొబైల్ నెంబర్ కేటాయించింది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్లో వస్తాయి. ఎస్ఎంఎస్ ఏ ఫార్మాట్లో పంపాలో, తెలుగులో బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఎస్ఎంఎంస్ ఎలా పంపాలో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
EPFO: మీ ఈపీఎఫ్ అకౌంట్లలో సమస్యలున్నాయా? తెలుగు రాష్ట్రాల వాట్సప్ నెంబర్స్ ఇవే
మీ EPF Account Transfer ఆన్లైన్లో ఈజీగా చేయండిలా
EPFO Portal: ఈపీఎఫ్ఓ వెబ్సైట్ https://www.epfindia.gov.in/ లో లాగిన్ అయి అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత Our Services ట్యాబ్‌లో for employees సెలెక్ట్ చేయాలి. Services ఆప్షన్లో Member passbook ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో UAN నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈపీఎఫ్ పాస్‌బుక్ చూడొచ్చు.
UMANG App: భారత ప్రభుత్వానికి చెందిన ఉమాంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం సులువే. ఉమాంగ్ యాప్‌లో బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ నాలుగు పద్ధతుల ద్వారా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఈజీగా తెలుస్తుంది. వెంటనే మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. వడ్డీ జమ కాకపోతే ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO, Personal Finance