ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో పెద్ద గోల్మాల్ జరిగింది. ఈ స్కామ్ కారణంగా ఈపీఎఫ్‌వో (EPFO) ఏకంగా రూ.1,000 కోట్ల వరకు నష్టపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కుంభకోణం (SCAM)లో పాల్గొన్న ఈపీఎఫ్‌వో ఉద్యోగులు పనికిరాని కంపెనీలలో బోగస్ అకౌంట్స్ క్రియేట్ చేసి నిధులను బదిలీ చేయడం లేదా క్లెయిమ్‌లను సెటిల్ చేయడం చేశారని తెలుస్తోంది. డబ్బులు స్వాహా చేసేందుకు జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల (Jet airways) ఖాతాలను ప్రధానంగా దుర్వినియోగం చేసినట్లు అధికారులు ఇప్పటికే గుర్తించినట్లు రిపోర్ట్ వెల్లడించింది. ముంబై (Mumbai) సబర్బన్ కార్యాలయ సిబ్బంది ఈ భారీ స్కామ్‌కి పాల్పడి ఉంటుందని EPFO సంస్థ అనుమానిస్తోంది. కాగా ఈ భారీ కుంభకోణాన్ని తీవ్రంగా పరిగణించిన EPFO ఈ స్కామ్ ఎవరు చేశారు, ఎలా జరిగిందనేది తెలుసుకునేందుకు తాజాగా దర్యాప్తు ప్రారంభించింది.
నిబంధనల ఉల్లంఘన, పన్ను ఎగవేతల కారణంగా సంస్థ వెయ్యి కోట్ల వరకు నష్టపోవచ్చని ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సభ్యుడు ప్రభాకర్ బాణాసురే పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో మెంబర్ల లైఫ్ సేవింగ్స్‌ను అన్యాయంగా కొల్లగొట్టినందుకు, అపెక్స్ రిటైర్మెంట్ బాడీని కించపరిచినందుకు నేరస్థులకు తగిన శిక్ష విధించాలని ఆయన కోరారు.
ప్రస్తుతం విజిలెన్స్ విభాగం గత రికార్డులను పరిశీలిస్తుంది కాబట్టి అసలు నష్టం తెలుసుకునేందుకు అంతర్గత విచారణ జరుగుతూ ఉండొచ్చని రిపోర్టు అభిప్రాయపడింది. కాగా తుది నివేదికను త్వరలో EPFO కేంద్ర విభాగానికి సమర్పించనుంది. ముంబైలోని కండివాలి కార్యాలయంలో ఈ మోసం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. చాలా మంది ప్రవాసులతో సహా జెట్ ఎయిర్‌వేస్‌లోని అప్పటి పైలట్లు, సిబ్బంది ఉద్యోగాలను ఉపయోగించడం ద్వారా స్కామ్ జరిగింది.
చాలా ఏళ్ల క్రితమే దివాలా తీసిన జెట్ ఎయిర్‌లైన్ ఉద్యోగుల అక్రమ పీఎఫ్ క్లెయిమ్‌లను కండివాలి పీఎఫ్ ఆఫీసు సీనియర్ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ మచింద్ర బామ్నే సెటిల్ చేసినట్లు తెలిసిందని, అందుకే EPFO అతన్ని సస్పెండ్ చేసినట్లు తాజాగా ఓ రిపోర్ట్ పేర్కొంది.
ఇది కూడా చదవండి : వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. బంతి పూల తోటను అలా మార్చి లక్షల్లో సంపాదిస్తున్న రైతు..
అంతేకాదు, ఈ విషయమై ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్-1 RO, కండివాలి ఈస్ట్ ఆగస్టు 18న ఒక ఆర్డర్ రిలీజ్ చేసింది. ఇందులో జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్ క్లెయిమ్‌ల సెటిల్మెంట్ కోసం మచింద్ర కొంతమంది సభ్యుల నుంచి తన బ్యాంక్ ఖాతాలోకి అక్రమంగా కమిషన్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు రుజువైందని పేర్కొన్నారు.
జెట్ ఎయిర్‌వేస్‌లోని చాలా మంది పైలట్లు లేదా సిబ్బందికి చెందిన పీఎఫ్ ఖాతాలను నిధులను స్వాహా చేయడానికి దుర్వినియోగం చేసినట్టు నివేదిక తెలిపింది. దీనివల్ల కండివాలి కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు EPFO అధికారులు ప్రయోజనం పొందినట్లు నివేదిక పేర్కొంది. రిపోర్ట్స్ ప్రకారం, 2019లోనే కొన్ని కోట్ల కుంభకోణం జరిగింది. కరోనా సమయంలో ఈ స్కామ్ మరింత పెద్దదిగా అవతరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Claim, EPFO, Jet Airways, Mumbai, National News, Scams