ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (EPF Account) ఉన్నవారికి అలర్ట్. వారం రోజుల పాటు నిలిచిపోయిన ఈపీఎఫ్ ఆన్‌లైన్ పాస్‌బుక్ (EPF Online Passbook) సదుపాయం తిరిగి ప్రారంభమైంది. ఈ సదుపాయం చివరకు పునరుద్ధరించడంతో, సభ్యులు తమ బ్యాలెన్స్, వడ్డీ క్రెడిట్ వివరాలను సులువుగా చెక్ చేయొచ్చు. సుమారు ఆరు కోట్ల మంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులు, వారం రోజుల విరామం తర్వాత వారి ఆన్‌లైన్ ఈఫీఎఫ్ పాస్‌బుక్‌ని యాక్సెస్ చేయవచ్చు. ఈపీఎఫ్ఓ సమాచారం ప్రకారం సాంకేతిక లోపాల కారణంగా జనవరి 2023 ప్రారంభంలో ఆన్‌లైన్ పాస్‌బుక్ సదుపాయానికి యాక్సెస్ నిలిచిపోయింది.
ఈపీఎఫ్ ఖాతాదారులు ఎప్పుడు వెబ్‌సైట్ ఓపెన్ చేసినా ఆన్‌లైన్ పాస్‌బుక్ సదుపాయం సాయంత్రం 5 గంటలకు రీస్టోర్ అవుతుందని కనిపించింది. పాస్‌బుక్ డౌన్‌లోడ్ సర్వీస్ అందుబాటులో లేకపోవడంతో ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు సోషల్ మీడియాలో నిరసన తెలిపారు. పోర్టల్‌ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ తమకు ఎర్రర్ మెసేజ్ వస్తుందని ఫిర్యాదు చేశారు. "సాంకేతిక నిర్వహణ సంబంధిత సమస్యల కారణంగా ఈపీఎఫ్ఓ సేవలు అందుబాటులో లేవు. అసౌకర్యానికి చింతిస్తున్నాం" అని ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎర్రర్ మెసేజ్ వచ్చింది.
CIBIL Score: సిబిల్ స్కోర్ పెరగాలా? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటించండి
జనవరి 18న ఈ సర్వీస్‌ను పునరుద్ధరించింది ఈపీఎఫ్ఓ. ఇప్పుడు ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్‌తో పాటు ఉమాంగ్ యాప్‌లో పాస్‌బుక్ సర్వీస్ రీస్టోర్ అయింది. ఈపీఎఫ్ ఖాతాదారులు ఉమాంగ్ యాప్‌తో పాటు ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/, ఇ-పాస్‌బుక్ పోర్టల్ https://passbook.epfindia.gov.in లో ఈపీఎఫ్ ఆన్‌లైన్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేయొచ్చు.
ఈపీఎఫ్ఓ ఇ-పాస్‌బుక్‌లో నెలవారీగా, ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం ఖాతా బ్యాలెన్స్ తెలుస్తుంది. దీంతో పాటు యజమాని, ఉద్యోగి వాటా బ్రేక్ అప్ కూడా చూడొచ్చు. ఉద్యోగుల పెన్షన్ పథకంలోకి జమ చేసిన మొత్తాన్ని కూడా చూడొచ్చు. పాస్‌బుక్ స్టేట్‌మెంట్‌లో ఆర్థిక సంవత్సరానికి జమ చేసిన వడ్డీ కూడా ఉంటుంది. మరి మీరు మీ ఈపీఎఫ్ పాస్‌బుక్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.
IRCTC Ticket Booking: రైలులో సీట్ల కేటాయింపు ఎలా జరుగుతుందో తెలుసా?
Step 1- ముందుగా epfindia.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో e-Passbook పైన క్లిక్ చేయాలి.
Step 3- కొత్త వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.
Step 4- యూఏఎన్ నెంబర్, క్యాప్చా కోడ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
Step 5- లాగిన్ చేసిన తర్వాత పాస్‌బుక్ కనిపిస్తుంది.
Step 6- పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేస్తే అందులో వడ్డీ జమ అయిందో లేదో కనిపిస్తుంది.
Indian Railways: రైలు మిస్ అయ్యారా? అదే టికెట్‌పై మరో రైలు ఎక్కొచ్చా? తెలుసుకోండి
Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో UMANG యాప్ డౌన్‌లోడ్ చేయాలి.
Step 2- మీ ఆధార్ నెంబర్ , ఇతర వివరాలతో లాగిన్ కావాలి.
Step 3- లాగిన్ అయిన తర్వాత EPFO సెక్షన్ ఓపెన్ చేయాలి.
Step 4- Employee Centric Services పైన క్లిక్ చేయాలి.
Step 5- View Passbook ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 6- మీ యూఏఎన్ నెంబర్ టైప్ చేసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి.
Step 7- స్క్రీన్ పైన పాస్‌బుక్ కనిపిస్తుంది.
Step 8- డౌన్‌లోడ్ చేసి అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO, Personal Finance