Good News : ఉద్యోగులకు శుభావార్త.. పీఎఫ్‌పై పెరిగిన వడ్డీశాతం.. 6 కోట్ల మందికి ప్రయోజనం..

EPFO: ఈపీఎఫ్ అకౌంట్‌తో ఆధార్ లింక్... ఉమాంగ్ యాప్‌లో చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపుకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది.

  • Share this:
    పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపుకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది.
    2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ఉద్యోగుల భవిష్య నిది సంస్థ(ఈపీఎఫ్‌వో) ప్రతిపాదించిన 8.65 శాతం వడ్డీ రేటుకి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఆరు కోట్ల మంది సబ్‌స్క్రైబర్లకి లాభం చేకూరనుంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే వడ్డీ రేటు పెరగడం ఇదే మొదటిసారి..

    ఈపీఎఫ్‌వో 2017-18లో సబ్‌స్క్రైబర్లకి 8.55 శాతం వడ్డీ రేట్లను అందించింది. ఇది ఐదేళ్ల కనిష్ట వడ్డీ రేటు. 2016-17లో వడ్డీ రేటు 8.65 శాతంగా, 2015-16లో 8.8 శాతంగా ఉంది. 2013-14లో వడ్డీ రేటు 8.75 శాతంగా ఉంది.. 2014-15లోనూ ఇదే వడ్డీరేటు కొనసాగింది.

    మొత్తానికీ వడ్డీ రేటు శాతం పెరగడంతో పీఎఫ్ ఖాతాదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
    First published: