ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఎఫ్ UAN కోసం కంపెనీతో పనిలేదు...

ఇకపై పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌ వంటి పింఛన్‌ సంబంధిత పత్రాలను డిజిలాకర్‌లో పొందే సదుపాయాన్ని ఈపీఎఫ్‌ఓ తీసుకొచ్చింది.

news18-telugu
Updated: November 1, 2019, 10:04 PM IST
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఎఫ్ UAN కోసం కంపెనీతో పనిలేదు...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
యాజమాన్యంతో సంబంధం లేకుండా యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ ను నేరుగా ఉద్యోగే పొందే సదుపాయాన్ని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ కల్పించింది. ప్రస్తుతం యూఏఎన్‌ నంబర్‌ పొందాలంటే యాజమాన్యంపై ఆధారపడాల్సి వచ్చేది. ఇకపై ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌ ద్వారా ఉద్యోగే నేరుగా పొందొచ్చు. ఉద్యోగి జీవితకాలం పాటు ఉండే ఈ నంబర్‌ ఉద్యోగం మారేటప్పుడు పీఎఫ్‌ మొత్తం బదిలీకి ఉపయోగపడుతుంది. దీంతో పాటు 65 లక్షల మంది పెన్షనర్ల కోసం ఓ కొత్త సదుపాయాన్ని ఈపీఎఫ్‌వో కల్పించింది. ఇకపై పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌ వంటి పింఛన్‌ సంబంధిత పత్రాలను డిజిలాకర్‌లో పొందే సదుపాయాన్ని తీసుకొచ్చింది. కాగిత రహిత వ్యవస్థలో భాగంగా డిజిలాకర్‌తో ఈపీఎఫ్‌వో చేతులు కలిపింది. ఈ రెండు కొత్త సదుపాయాలను కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ ప్రవేశపెట్టారు. ఈపీఎఫ్‌వో 67వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రెండు కొత్త సదుపాయాలను ప్రారంభించారు. వీటితో పాటు యజమానుల కోసం ఈ-ఇన్‌స్పెక్షన్‌ సదుపాయాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌వోలో సుమారు 6 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు.

First published: November 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>