ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF ఖాతాదారులకు బుధవారం రెండు శుభవార్తలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకటి ఈపీఎఫ్ వడ్డీకి సంబంధించినది అయితే, మరొకటి పెన్షన్‌కు సంబంధించినది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న సంఘటిత రంగ కార్మికుల కోసం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ తర్వాత ప్రైవేట్ ఉద్యోగులు పెన్షన్ పొందొచ్చు. ఈపీఎఫ్ స్కీమ్ 1952 చట్టం ప్రకారం ఉద్యోగి మూలవేతనంలోని 12 శాతం వాటాలో 8.33 శాతం ఈపీఎస్‌లోకి వెళ్తుంది. మిగిలిన 3.67 శాతంతో పాటు యజమాని వాటా 12 శాతం ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. ఉద్యోగి 58 ఏళ్ల వయస్సులో రిటైరైన తర్వాత ఈపీఎస్ నుంచి ప్రతీ నెలా పెన్షన్ లభిస్తుంది. అయితే ఇప్పటివరకు కనీస పెన్షన్ కేవలం రూ.1000 మాత్రమే ఉంది. ప్రస్తుతం ఉన్న అవసరాలకు రూ.1000 పెన్షన్ ఏమాత్రం సరిపోదు. అందుకే కనీస పెన్షన్‌ను పెంచాలన్న డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోంది. ట్రేడ్ యూనియన్లు, లేబర్ ఆర్గనైజేషన్లు కూడా కనీస పెన్షన్ పెంచాలని ఎప్పట్నుంచో కోరుతున్నాయి.
SBI ATM cash: ఏటీఎం విత్‌డ్రా లిమిట్ మారింది... మీ ఎస్బీఐ కార్డుతో ఎంత డ్రా చేయొచ్చంటే
LIC Policy: ఒక్కసారి ప్రీమియం కడితే ప్రతీ నెల రూ.19,000 మీ అకౌంట్లోకి
ఈపీఎఫ్ఓ పెట్టుబడులపై పరిశీలన జరిపేందుకు పార్లమెంటరీ ప్యానెల్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈపీఎఫ్ఓ పనితీరు, మేనేజ్మెంట్, కరోనా వైరస్ సంక్షోభ కాలంలో పెట్టుబడులను ఈ ప్యానెల్ పరిశీలిస్తోంది. అక్టోబర్ 28న లేబర్ ప్యానెల్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కనీస పెన్షన్ పెంచే విషయమై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. కనీస పెన్షన్‌ను రూ.1000 నుంచి రూ.2000 చేస్తారన్న వార్తలు గతంలో వచ్చాయి. కానీ అంతకన్నా ఎక్కువే కనీస పెన్షన్ ఉండబోతోందని అంచనా. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద ఏకంగా నెలకు రూ.5000 కనీస పెన్షన్ ఇచ్చే దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే కోట్లాది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇది అతిపెద్ద శుభవార్త కానుంది. దీంతో పాటు ప్యానెల్ మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇచ్చే వడ్డీ రేటును పెంచుతారని వార్తలొస్తున్నాయి.
Flipkart Big Diwali sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 7 స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
Flipkart Big Diwali Sale: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.30,000 డిస్కౌంట్... ఫైనల్ రేట్ ఎంతంటే
ప్రస్తుతం 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీ ప్రకటించింది ఈపీఎఫ్ఓ. గత ఏదేళ్లతో పోలిస్తే ఇదే తక్కువ వడ్డీ. కాబట్టి 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ పెంచే అవకాశం ఉందని అనుకుంటున్నారు. వడ్డీ త్వరలోనే ఖాతాదారుల అకౌంట్లలో జమ కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, BUSINESS NEWS, EPFO, Personal Finance