హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF: ఈపీఎఫ్ ఖాతాదారులకు త్వరలో షాక్... ఎందుకంటే?

EPF: ఈపీఎఫ్ ఖాతాదారులకు త్వరలో షాక్... ఎందుకంటే?

EPF: ఈపీఎఫ్ ఖాతాదారులకు త్వరలో షాక్... ఎందుకంటే?
(ప్రతీకాత్మక చిత్రం)

EPF: ఈపీఎఫ్ ఖాతాదారులకు త్వరలో షాక్... ఎందుకంటే? (ప్రతీకాత్మక చిత్రం)

EPF Interest Rates | మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉందా? మీ ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తున్నారా? అయితే త్వరలో ఈపీఎఫ్ఓ బ్యాడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది.

  ఈపీఎఫ్ ఖాతాదారులకు త్వరలో షాక్ తగిలే అవకాశముంది. ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇచ్చే వడ్డీని మరోసారి తగ్గించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ఆలోచిస్తోందన్న వార్తలొస్తున్నాయి. ఇటీవల చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు భారీగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈపీఎఫ్ఓ కూడా తమ ఖాతాదారులకు ఇచ్చే వడ్డీని తగ్గించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.65% నుంచి 8.50% ఛేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ వడ్డీ చెల్లించే అవకాశాలు కనిపించట్లేదు. అందుకే వడ్డీ రేటును తగ్గించాలని ఈపీఎఫ్ఓ భావిస్తున్నట్టు ఎకనమిక్ టైమ్స్ కథనం పబ్లిష్ చేసింది. ఈపీఎఫ్ఓ ఉన్నతాధికారులు త్వరలో ఆర్థిక శాఖతో పాటు ఇన్వెస్ట్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీని కలిసి పీఎఫ్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముందే నిర్ణయించిన వడ్డీ చెల్లించాలా లేదా తగ్గించాలా అన్న నిర్ణయం ఈ సమావేశంలో తీసుకోవచ్చు.


  ఈపీఎఫ్ఓ పెట్టుబడుల్లో 85% డెట్ మార్కెట్స్ (బాండ్స్) లో ఉండగా, మిగిలిన 15 శాతం ఈటీఎఫ్ ద్వారా షేర్ మార్కెట్‌లో ఉంది. గతేడాది మార్చి చివరి నాటికి ఈక్విటీస్‌లో ఈపీఎఫ్ఓ పెట్టుబడులు రూ.74,324 కోట్లు కాగా, 14.74% రిటర్న్స్ రావడం విశేషం. అయితే రూ.4,500 కోట్లు దీవాన్ హౌజింగ్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ లాంటి ఎన్‌బీఎఫ్‌సీల్లో పెట్టుబడి పెట్టింది. డీహెచ్ఎఫ్ఎల్ దివాళా ప్రక్రియలో ఉండగా, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్‌ను కాపాడే పనిలో ఉంది ప్రభుత్వం. ఈ రెండు కంపెనీల్లో ఈపీఎఫ్ఓ డబ్బులు ఇరుక్కుపోయాయి. దీంతో పాటు ఇటీవల చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు తగ్గుతుండటంతో ఈపీఎఫ్ఓ కూడా వడ్డీ రేట్లు తగ్గించాలన్న ఆలోచనలో ఉంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Business, BUSINESS NEWS, EPFO

  ఉత్తమ కథలు