Home /News /business /

EPFO LIKELY TO CREDIT INTEREST BEFORE DIWALI REPORT MK GH

EPFO Interest: దీపావళికి ముందే ఉద్యోగులకు శుభవార్త!.. ఈపీఎఫ్ఓ వడ్డీ జమయ్యే అవకాశం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఉద్యోగులు వేచిచూస్తున్న 2021 ఆర్థిక సంవత్సరం వడ్డీని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) త్వరలోనే జమ చేయనుందని సమాచారం. దీపావళికి ముందే ఉద్యోగుల ఖాతాల్లో ఈపీఎఫ్ఓ వడ్డీ వేస్తుందని వార్తలు వస్తున్నాయి.

ఉద్యోగులకు ఊరట కలిగించే వార్త ఇది. కరోనా కష్టకాలంలో సతమతమవుతున్న వేతన జీవులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగులు వేచిచూస్తున్న 2021 ఆర్థిక సంవత్సరం వడ్డీని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) త్వరలోనే జమ చేయనుందని సమాచారం. దీపావళికి ముందే ఉద్యోగుల ఖాతాల్లో ఈపీఎఫ్ఓ వడ్డీ వేస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతో పండుగ సీజన్ లో ఉద్యోగులకు కాస్త ముందుగానే తీపికబురు అందే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే డీఏ, డీఆర్ పొందిన ఉద్యోగులకు ఈ వడ్డీ జమ మరింత చేయూతనివ్వనుంది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎఫ్ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీరేటే కొనసాగుతుందని రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్ మార్చిలోనే స్పష్టం చేశారు. ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే ఆమోద ముద్ర వేస్తుందని కథనాలు తెలుపుతున్నాయి.

"2020-21 సంవత్సరానికి 8.5 శాతం వడ్డీ రేటును కొనసాగించేందుకు ఆమోదం కోసం అధికారులు ప్రతిపాదనలు పంపారు. వడ్డీకి సంబంధించి నిర్ణయం తీసుకున్నాక, అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని 8.5 శాతం వడ్డీని జమ చేస్తాం. మా ఆఖరి బోర్డు మీటింగ్ తర్వాత నుంచి ఈక్విటీ మార్కెట్లు చాలా బాగా పెరుగుతున్నాయి. దీని ద్వారా మంచి ఆదాయమే వచ్చింది" అని ఈపీఎఫ్ఓ అధికారి ఒకరు ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

కాగా గత ఆర్థిక సంవత్సరం ఈపీఎఫ్ఓ ఆదాయం రూ.70,300 కోట్లకు పడిపోయినట్టు నివేదికలు వెల్లడించాయి. ఈక్విటీ పెట్టుబడుల్లో రూ.4వేల కోట్ల విలువైన భాగాన్ని కూాడా విక్రయించింది. డెబిట్ పెట్టుబడుల ద్వారా వచ్చే వడ్డీ, ఈక్విటీ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయాన్ని బట్టే సాధారణంగా ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లను ఖరారు చేస్తుంటుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏ, డీఆర్ లను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ జులై 14న ఆమోదముద్ర వేసింది. ఇది జులై 1 నుంచి అమలులోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది.

ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ పై వచ్చే వడ్డీలపై పన్ను నిబంధనలను సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) మార్చింది. రూ.2.5లక్షల కాంట్రిబ్యూషన్ కంటే ఎక్కువగా ఉన్న వారికి ఇది వర్తించనుంది. కొత్త నిబంధన ప్రకారం, సంస్థలు రెండు ఈపీఎఫ్ ఖాతాలను కలిగి ఉండాలి. ఒకటి ట్యాక్సబుల్ కాంట్రిబ్యూషన్ కోసం, మరొకటి నాన్ ట్యాక్సబుల్ కాంట్రిబ్యూషన్ కోసం. 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే దీని ప్రభావం ఉంటుందని సీబీడీటీ స్పష్టం చేసింది.
Published by:Krishna Adithya
First published:

Tags: EPFO

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు