ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉన్నవారికి శుభవార్త. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ఇటీవల వాట్సప్ హెల్ప్‌లైన్ సర్వీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్షలాది మంది ఈపీఎఫ్ ఖాతాదారులు వాట్సప్ ద్వారా సేవలు పొందుతున్నారు. ఇప్పటికే ఈపీఎఫ్ ఐ గ్రీవియెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్-EPFiGMS పోర్టల్, సెంట్రలైజ్డ్, పబ్లిక్ గ్రీవియెన్స్ రీడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్-CPGRAMS, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, ప్రత్యేకంగా కాల్ సెంటర్ ద్వారా ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు సేవలు అందిస్తోంది ఈపీఎఫ్ఓ. ఇటీవల కొత్తగా వాట్సప్ హెల్ప్‌లైన్ సర్వీస్ కూడా ప్రారంభించింది. అయితే ఒకే హెల్ప్‌లైన్ నెంబర్ ఉన్నట్టు ఒకే వాట్సప్ నెంబర్ ఉండదు. ప్రాంతాలను బట్టి వాట్సప్ నెంబర్లు మారుతుంటాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, విశాఖపట్నం, గుంటూరు, కడప, రాజమండ్రి ప్రాంతాలకు వేర్వేరు వాట్సప్ నెంబర్స్ ఉంటాయి. జోనల్ ఆఫీస్‌లోని రీజనల్ ఆఫీసులకు ప్రత్యేకంగా ఈ వాట్సప్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఆయా రీజనల్ ఆఫీస్‌లో ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారు సంబంధిత నెంబర్లను మాత్రమే వాట్సప్‌లో సంప్రదించాల్సి ఉంటుంది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతాలకు ఏ వాట్సప్ నెంబర్ కేటాయించారో తెలుసుకోండి.
Oneplus 7T: రూ.39,999 విలువైన స్మార్ట్‌ఫోన్ సగం ధరకే కొనండి ఇలా
SBI Debit Card: ఏటీఎం కార్డు పోయిందా? సింపుల్‌గా బ్లాక్ చేయండిలా
తెలంగాణ- హైదరాబాద్ జోనల్ ఆఫీస్
హైదరాబాద్ (బర్కత్‌పుర)- 9100026170
హైదరాబాద్ (మాదాపూర్)- 9100026146
కరీంనగర్- 9492429685
కూకట్పల్లి- 9392369549
నిజామాబాద్- 8919090653
పటాన్చెరు- 9494182174
సిద్దిపేట్- 9603262989
వరంగల్- 8702447772
ఆంధ్రప్రదేశ్- విజయవాడ జోనల్ ఆఫీస్
గుంటూరు- 0863-2344123
కడప- 9491138297
రాజమండ్రి- 9494633563
విశాఖపట్నం 7382396602
ATM: ఏటీఎం యూజర్లకు అలర్ట్... ఇక ఈ ఛార్జీలు చెల్లించాల్సిందే
Vivo: రూ.9,990 విలువైన వివో స్మార్ట్‌ఫోన్‌ను రూ.3,096 ధరకే సొంతం చేసుకోండి
మీకు ఈపీఎఫ్ అకౌంట్‌కు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే ముందుగా మీ రీజనల్ ఆఫీస్ ఏదో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ రీజనల్ ఆఫీస్‌కు కేటాయించిన వాట్సప్ నెంబర్‌ను మీ మొబైల్లో సేవ్ చేసుకోవాలి. ఉదాహరణకు మీ ఈపీఎఫ్ అకౌంట్ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ బర్కత్‌పుర అయితే 9100026170 వాట్సప్ నెంబర్‌ను కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా దేశంలోని 138 రీజనల్ ఆఫీసులకు వేర్వేరు వాట్సప్ నెంబర్లను కేటాయించింది ఈపీఎఫ్ఓ. ఆ వివరాలను ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ https://www.epfindia.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO, Personal Finance, Whatsapp