హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF claim: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... ఇక క్లెయిమ్ సెటిల్మెంట్‌కు కొత్త విధానం

EPF claim: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... ఇక క్లెయిమ్ సెటిల్మెంట్‌కు కొత్త విధానం

EPF claim: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... ఇక క్లెయిమ్ సెటిల్మెంట్ ఈజీ
(ప్రతీకాత్మక చిత్రం)

EPF claim: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... ఇక క్లెయిమ్ సెటిల్మెంట్ ఈజీ (ప్రతీకాత్మక చిత్రం)

EPF claim settlement | ఈపీఎఫ్ క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకునేవారికి శుభవార్త. ఈపీఎప్ క్లెయిమ్ సెటిల్మెంట్‌లో ఇబ్బందులు తలెత్తకుండా సరికొత్త విధానాన్ని ప్రారంభించింది ఈపీఎఫ్ఓ.

  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF ఖాతాదారులకు శుభవార్త. ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్లలో ఇబ్బందులు తలెత్తకుండా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. మల్టీ లొకేషన్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఫెసిలిటీని ప్రారంభించింది. ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్లను ఏ ప్రాంతీయ కార్యాలయాల్లో అయినా పూర్తి చేసే సరికొత్త విధానాన్ని ప్రారంభించింది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా కంటైన్మెంట్ జోన్లలో ఈపీఎఫ్ కార్యాలయాలు మూతపడటం, తక్కువ సిబ్బందితో పనిచేయడం లాంటి సమస్యలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ కార్యాలయానికి సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్లలో జాప్యం జరుగుతోంది. ఈ ఆలస్యాన్ని నివారించేందుకు ఏ ప్రాంతీయ కార్యాలయంలో అయినా క్లెయిమ్ సెటిల్ చేసేలా మార్పులు చేసింది. దేశంలోని అన్ని ప్రాంతీయ కార్యాలయాలకు ఇది వర్తిస్తుంది.

  ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, పాక్షిక విత్‌డ్రా, క్లెయిమ్స్, ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్స్ లాంటి అన్ని రకాల ఆన్‌లైన్ క్లెయిమ్స్ మల్టీ లొకేషన్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఫెసిలిటీ ద్వారా చేయొచ్చని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఈపీఎఫ్ఓ పాండమిక్ అడ్వాన్స్ ఫెలిసిలిటీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2020 ఏప్రిల్ 1 నుంచి 80,000 పైగా క్లెయిమ్స్ సెటిల్ చేసింది ఈపీఎఫ్ఓ. మూడు రోజుల్లోనే కోవిడ్ 19 అడ్వాన్సులను సెటిల్ చేస్తోంది.

  ఇవి కూడా చదవండి:

  Electric Scooter: 15 రూపాయలకే 100 కిలోమీటర్ల ప్రయాణం... ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతం

  Petrol Prices: వాహనదారులకు షాక్... వరుసగా 10వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

  PAN Card: ఆన్‌లైన్‌లో డూప్లికేట్ పాన్ కార్డు... తీసుకోండి ఇలా

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Business, BUSINESS NEWS, EPFO, Personal Finance

  ఉత్తమ కథలు