PF Withdrawl: 5 రోజుల్లో పీఎఫ్ డబ్బులు మీ అకౌంట్‌లో... ఆన్‌లైన్ ప్రాసెస్ ఇదే

PF Withdrawal | పిల్లల పైచదువులు, ఆస్తి కొనుగోలు, ఇంటి నిర్మాణం, పెళ్లి, హోమ్ లోన్ చెల్లింపు లాంటి కారణాలతో పీఎఫ్ పాక్షికంగానే విత్‌డ్రా చేసుకోవచ్చు. మరి ఆన్‌లైన్‌లో పీఎఫ్ ఎలా విత్‌డ్రా చేసుకోవాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: April 30, 2019, 1:53 PM IST
PF Withdrawl: 5 రోజుల్లో పీఎఫ్ డబ్బులు మీ అకౌంట్‌లో... ఆన్‌లైన్ ప్రాసెస్ ఇదే
పీఎంఏవై కింద దరఖాస్తు చేసుకునే వారికి MIG 1 వారి వార్షిక ఆదాయం రూ.12లక్షల లోపు ఉండాలి.
  • Share this:
ఈపీఎఫ్... ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. ఈ ఫండ్‌లో మీ జీతంలోంచి నెలనెలా కొంత మొత్తం మీరు చేసే పొదుపు భవిష్యత్తులో మీకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అత్యవసర సమయంలో ఆదుకుంటుంది. ఖాతాదారుల సౌలభ్యం కోసం పీఎఫ్‌ను ఆన్‌లైన్‌లోనే విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO. మీరు ఉద్యోగం చేస్తుండగానే మీ పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు. మొత్తం విత్‌డ్రా చేయాలంటే మూడు సందర్భాల్లోనే సాధ్యం. రిటైర్మెంట్ తర్వాత, రెండు నెలలు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నా, రిటైర్మెంట్ కన్నా ముందే చనిపోతే నామినీ విత్‌డ్రా చేసుకోవచ్చు. పిల్లల పైచదువులు, ఆస్తి కొనుగోలు, ఇంటి నిర్మాణం, పెళ్లి, హోమ్ లోన్ చెల్లింపు లాంటి కారణాలతో పాక్షికంగానే విత్‌డ్రా చేసుకోవచ్చు. మరి ఆన్‌లైన్‌లో పీఎఫ్ ఎలా విత్‌డ్రా చేసుకోవాలో తెలుసుకోండి.

Read this: ATM: కార్డు లేకపోయినా ఏటీఎంలో డబ్బులు డ్రా... చేసుకోవచ్చు ఇలా

ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా... స్టెప్స్ ఇవే...


ముందుగా మీరు EPFO అధికారిక వెబ్‌సైట్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఓపెన్ చేయాలి.
UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయాలి.
మెంబర్‌ ప్రొఫైల్ పేజీలో ‘Manage’ ట్యాబ్‌పైన క్లిక్ చేయాలి.
డ్రాప్‌డౌన్ మెనూ నుంచి KYC సెలెక్ట్ చేయాలి.తర్వాతి పేజీలో ‘Online Services’ క్లిక్ చేయాలి.
డ్రాప్-డౌన్ లిస్ట్‌లో ‘Claim Form-31,19 & 10C ఎంచుకోవాలి.
మీ బ్యాంక్ అకౌంట్‌లోని చివరి నాలుగు అంకెల్ని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
తర్వాతి పేజీలో ఆన్‌లైన్‌ క్లెయిమ్‌కు అనుమతి ఇవ్వాలి.
మీ కేవైసీ వివరాలను ఈపీఎప్ఓ సేకరించి ఆన్‌లైన్ పీఎఫ్ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేస్తుంది.
ఆన్‌లైన్ పీఎఫ్ క్లెయిమ్‌ ప్రాసెస్ పూర్తైతే 10 రోజుల్లో మీ అకౌంట్‌లో డబ్బులు క్రెడిట్ అవుతాయి.
ఆన్‌లైన్‌లో పీఎఫ్ క్లెయిమ్ చేసుకోవడానికి ముందు మీ కేవైసీ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

WhatsApp IPL Stickers: వాట్సప్‌లో క్రికెట్ స్టిక్కర్స్... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

Aadhaar Alert: ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ చెల్లదు... ఏం చేయాలో తెలుసుకోండి

Jio Effect: ఎయిర్‌టెల్ నుంచి తక్కువ ధరతో రీఛార్జ్ ప్లాన్స్
First published: April 30, 2019, 1:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading