హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPFO: గుడ్ న్యూస్... ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కొత్త సదుపాయం

EPFO: గుడ్ న్యూస్... ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కొత్త సదుపాయం

EPF Date of Exit Update | ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో డేట్ ఆఫ్ ఎగ్జిట్ వెల్లడించేందుకు గత యాజమాన్యాలు సహకరించట్లేదని ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేశారు.

EPF Date of Exit Update | ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో డేట్ ఆఫ్ ఎగ్జిట్ వెల్లడించేందుకు గత యాజమాన్యాలు సహకరించట్లేదని ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేశారు.

EPF Date of Exit Update | ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో డేట్ ఆఫ్ ఎగ్జిట్ వెల్లడించేందుకు గత యాజమాన్యాలు సహకరించట్లేదని ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేశారు.

  మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO మీకు శుభవార్త చెప్పింది. సరికొత్త సదుపాయాన్ని ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉద్యోగులు జాబ్ మారిన తర్వాత తమ ఎగ్జిట్ డేట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసే అవకాశాన్ని ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు కల్పిస్తూ 'డేట్ ఆఫ్ ఎగ్జిట్' సదుపాయాన్ని ప్రారంభించింది ఈపీఎఫ్ఓ. ఇప్పటివరకు ఎగ్జిట్ డేట్ కోసం ఉద్యోగులు తమ మాజీ యాజమాన్యాలపై ఆధారపడాల్సి వచ్చేది. ఆన్‌లైన్‌లో ఈ ఆప్షన్ లేకపోవడంతో ఈపీఎఫ్ ఖాతాదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో డేట్ ఆఫ్ ఎగ్జిట్ వెల్లడించేందుకు గత యాజమాన్యాలు సహకరించట్లేదని ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది ఈపీఎఫ్ఓ. ఇకపై ఈపీఎఫ్ ఖాతాదారులే 'డేట్ ఆఫ్ ఎగ్జిట్'ను ఆన్‌లైన్‌లో సులువుగా అప్‌డేట్ చేయొచ్చు.

  EPFO Date of exit Updation: డేట్ ఆఫ్ ఎగ్జిట్‌ను అప్‌డేట్ చేయండి ఇలా


  మీరు మీ ఈపీఎఫ్ అకౌంట్‌లో 'డేట్ ఆఫ్ ఎగ్జిట్' ఎంటర్ చేయాలంటే ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/ ఓపెన్ చేయండి.

  మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.

  Manage సెక్షన్‌లో Mark Exit పైన క్లిక్ చేయండి.

  మీ పీఎఫ్ అకౌంట్‌ నెంబర్‌ను ఎంచుకోండి.

  డ్రాప్‌డౌన్ మెనూలో select employment పైన క్లిక్ చేయండి.

  ఆ తర్వాత ఎగ్జిట్ తేదీ, కారణం వెల్లడించండి.

  Request OTP పైన క్లిక్ చేస్తే ఆధార్‌తో లింకైన మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

  ఓటీపీ ఎంటర్ చేసి అప్‌డేట్ పైన ఆ తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి.

  'డేట్ ఆఫ్ ఎగ్జిట్' అప్‌డేట్ అయినట్టు మీకు మెసేజ్ వస్తుంది.

  మీరు View క్లిక్ చేసి Service History సెక్షన్‌లో జాయినింగ్ డేట్, ఎగ్జిట్ డేట్ చూడొచ్చు.

  మీరు కంపెనీని వదిలేయడానికి రెండు నెలల ముందుగానే డేట్ ఆఫ్ ఎగ్జిట్ మార్క్ చేయడం కుదరదు. డేట్ ఆఫ్ ఎగ్జిట్ వెల్లడించడం ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్లకు అవసరం. లేకపోతే క్లెయిమ్ సబ్మిషన్, సెటిల్మెంట్లలో ఇబ్బందులు వస్తాయి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేకపోతే మీరు ఇంకా ఆ కంపెనీలో కొనసాగుతున్నట్టు భావిస్తుంది ఈపీఎఫ్ఓ.

  ఇవి కూడా చదవండి:

  Pension Scheme: ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే నెలకు రూ.10,000 పెన్షన్

  Save Money: రూ.1 కోటి కావాలంటే ఇలా పొదుపు చేయండి

  PPF New Rules: మారిన పీపీఎఫ్ రూల్స్‌తో లాభమా... నష్టమా? తెలుసుకోండి

  First published:

  Tags: EPFO, Pension Scheme, Pensioners, Personal Finance

  ఉత్తమ కథలు