Employees | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో – EPFO) తాజాగా తీపికబురు అందించింది. తన ఉద్యోగులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. ఉద్యోగులకు అందించే పలు వెల్ఫేర్ యాక్టివిటీస్ మొత్తాన్ని (Money) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈపీఎప్‌వో ఒకట సర్క్యూలర్ జారీ చేసింది. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమీషన్, ఈపీఎఫ్ సెంట్రల్ స్టాఫ్ వెల్ఫేర్ కమిటీ తాజాగా ఈ రేట్ల పెంపునకు ఆమోదం తెలిపిందని వివరించింది. మెమెంటోస్, స్టాఫ్ రిక్రియేషన్ క్లబ్, స్పెషల్ అవార్డు, స్కాలర్‌షిప్, బుక్ అవార్డు వంటి రేట్లు పైకి చేరాయని చెపుకోవచ్చు.
సర్క్యూలర్ ప్రకారం చూస్తే.. ప్రస్తుత మెమెంటోస్ లేదా రిటైర్మెంట్ ఫేర్‌వేర్ రేటు రూ. 15 వేలుగా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు దీన్ని రిటైర్మెంట్ ఉద్యోగులకు రూ. 20 వేలకు పెంచారు. అలాగే 12వ తరగతిలో ఏ రాష్ట్రంలోనైనా టాపర్‌గా నిలిచిన ఉద్యోగి పిల్లలకు ఇచ్చే ప్రత్యేక అవార్డును రూ. 10,000 నుంచి రూ. 15,000కు పెంచారు. 12వ తరగతిలో 80 శాతం మార్కులు సాధించిన ఉద్యోగుల పిల్లలకు అందించే ఉపకార వేతనాన్ని నెలకు రూ. 600 నుంచి రూ. 1000కు పెంచేశారు. ఆర్ట్స్/సైన్స్/కామర్స్‌లో 65 శాతం మార్కులు సాధించిన ఉద్యోగుల పిల్లలకు అందించే స్కాలర్‌షిప్ కూడా నెలకు రూ. 600 నుంచి రూ. 1000కి పెరిగింది.
రూ.1,200 పెట్టి గ్యాస్ సిలిండర్ కొనక్కర్లేదు.. ఈ స్టవ్‌తో రూ.1 ఖర్చు లేకుండా వంట చేసుకోవచ్చు!
10వ తరగతి, 12వ తరగతిలో ఉద్యోగి పిల్లలు 80 శాతం కన్నా ఎక్కువ మార్కులు సాధిస్తే ఇచ్చే బుక్ అవార్డు మొత్తాన్ని రూ. 1800 నుంచి రూ. 3000కు పెంచారు. ఎంబీబీఎస్/బీడీఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే స్కాలర్‌షిప్‌ను నెలకు రూ. 600 నుంచి రూ. 1000 పెంచేశారు. పీజీ కోర్సు (ఆర్ట్స్/సైన్స్/కామర్స్)లో 65 శాతం స్కోర్ పొందిన వారికి స్కాలర్‌షిప్ మొత్తాన్ని నెలకు రూ. 700 నుంచి రూ. 1200కి పెంచారు. సర్క్యులర్ ప్రకారం.. సంక్షేమ కార్యకలాపాలకు సవరించిన రేట్లు 2023 ఏప్రిల్ 1 నుండి వర్తిస్తాయి.
వాహనదారులకు హెచ్చరిక.. ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్‌స్టాలో ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తే రూ.25 వేల జరిమానా!
కాగా ఈపీఎఫ్‌వో ఈ నెల చివరిలో బోర్డు మీటింగ్ నిర్వహించబోతోంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. పీఎఫ్ అకౌంట్‌పై వడ్డీ రేటుపై ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఇంకా అధిక పెన్షన్ అంశంపై పీఎఫ్ చందాదారుల్లో నెలకొన్ని గందగోళాన్ని తొలగించే ప్రయత్నం జరగొచ్చు. అందువల్ల ఈ నెల చివరిలో పీఎఫ్ ఖాతాదారులకు ముఖ్యమైన అలర్ట్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అధిక పెన్షన్ పొందటానికి అర్హత కలిగిన వారు మే 3 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Employees, Epf, EPFO, PF account, Pf balance