హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPFO: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈ విషయం తెలుసుకోకపోతే రూ.50,000 లాస్

EPFO: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈ విషయం తెలుసుకోకపోతే రూ.50,000 లాస్

EPFO: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈ విషయం తెలుసుకోకపోతే రూ.50,000 లాస్
(ప్రతీకాత్మక చిత్రం)

EPFO: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈ విషయం తెలుసుకోకపోతే రూ.50,000 లాస్ (ప్రతీకాత్మక చిత్రం)

EPF Loyalty cum life benefit | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉన్నవారికి ఈపీఎఫ్ఓ నుంచి అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. అలాంటివాటిలో ఒకటి లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్. ఎలా పొందాలో తెలుసుకోండి.

  మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉందా? ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. జమ చేసిన డబ్బులకు వడ్డీ ఎక్కువగా వస్తుందని, పెన్షన్ వస్తుందని మాత్రమే చాలామందికి తెలుసు. కానీ ఈపీఎఫ్ఓ నుంచి సబ్‌స్క్రైబర్లకు తెలియని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఈపీఎప్ఓ రూల్స్ పూర్తిగా తెలుసుకుంటే ఈ బెనిఫిట్స్ గురించి తెలుస్తాయి. ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు రూ.6,00,000 వరకు ఇన్స్యూరెన్స్ ఇచ్చే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్-EDLI స్కీమ్‌ కూడా ఉంది. ఈ స్కీమ్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇది కాకుండా లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ కూడా ఉంది. దీని ద్వారా ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్‌కు రిటైర్మెంట్ సమయంలో రూ.50,000 వరకు బెనిఫిట్ లభిస్తుంది.

  లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ అందరికీ వర్తించదు. ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ కనీసం 20 ఏళ్ల పాటు ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేయాలి. వారికే లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ రూపంలో రూ.50,000 వరకు అదనంగా లాభం ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడు ఉద్యోగం మారినా ఒకే ఈపీఎఫ్ అకౌంట్ మెయింటైన్ చేయడం మంచిది. వేర్వేరు అకౌంట్ మెయింటైన్ చేయడం వల్ల కంటిన్యుటీ ఉండదు. ఒకే పీఎఫ్ అకౌంట్‌ను కనీసం 20 ఏళ్లు మెయింటైన్ చేయాలి. అప్పుడే మీరు రూ.30,000 నుంచి రూ.50,000 మధ్య లాయల్టీ బెనిఫిట్ పొందొచ్చు.

  ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్‌కు లాయల్టీ బెనిఫిట్ ఎంత ఇవ్వాలన్నది వారి బేసిక్ వేతనంపైన ఆధారపడి ఉంటుంది. బేసిక్ సాలరీ రూ.5,000 వరకు ఉన్నవారికి లాయల్టీ బెనిఫిట్ రూ.30,000 వస్తుంది. రూ.5,001 నుంచి రూ.10,000 బేసిక్ సాలరీ ఉంటే లాయల్టీ బెనిఫిట్ రూ.40,000 పొందొచ్చు. బేసిక్ సాలరీ రూ.10,000 పైన ఉన్నవారికి లాయల్టీ బెనిఫిట్ రూ.50,000 లభిస్తుంది. కాబట్టి మీ బేసిక్ వేతనం ఎంతో చెక్ చేస్తే మీకు లాయల్టీ బెనిఫిట్ ఎంతవరకు రావొచ్చో అంచనా వేయొచ్చు. అయితే 20 ఏళ్లు కనీసం ఈపీఎఫ్ అకౌంట్ మెయింటైన్ చేయాలి. ఈపీఎఫ్ఓకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  ఇవి కూడా చదవండి:

  Lockdown: లాక్‌డౌన్‌లో ఈ బిజినెస్ సూపర్ హిట్... ప్రభుత్వ సాయంతో వ్యాపారం చేయండిలా

  LIC Policy Loan: మీ ఎల్ఐసీ పాలసీపై లోన్ తీసుకోవచ్చు ఇలా

  Home Loan: హోమ్ లోన్ ఉందా? ఈ టెక్నిక్‌తో ఈఎంఐ తగ్గించుకోండి

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Business, BUSINESS NEWS, EPFO, Personal Finance

  ఉత్తమ కథలు