హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF-Aadhar link: ఈపీఎఫ్‌-ఆధార్ లింక్ గ‌డువు పొడ‌గింపు.. డిసెంబ‌ర్ వ‌ర‌కు అవ‌కాశం

EPF-Aadhar link: ఈపీఎఫ్‌-ఆధార్ లింక్ గ‌డువు పొడ‌గింపు.. డిసెంబ‌ర్ వ‌ర‌కు అవ‌కాశం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) స‌భ్యుల‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్‌వో స‌భ్యులు త‌మ ఈపీఎఫ్ ఖాతాను ఆధార్ నంబ‌ర్‌తో అనుసంధానించ‌డానికి గ‌డువును డిసెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు కేంద్రం పొడిగించింది.

  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉన్నవారు తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడం తప్పనిసరి. ఈపీఎఫ్ అకౌంట్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి 2021 జూన్ 1 గడువు అని గతంలోనే ప్రకటించింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్-EPFO. కానీ యాజమాన్యాలు ఉద్యోగుల పీఎఫ్ జమ చేయడంలో ఇబ్బందులు రావడంతో ఈ గడువును 2021 సెప్టెంబర్ 1 వరకు పొడిగించింది. అంటే సెప్టెంబర్ 1 లోగా ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లు తప్పనిసరిగా తమ ఆధార్ నెంబర్ లింక్ చేయాల్సిందే. ఉద్యోగులు తమ ఆధార్ నెంబర్‌ను ఈపీఎఫ్ అకౌంట్‌కు లింక్ చేసేలా యాజమాన్యాలు అప్రమత్తం చేయాలని ఈపీఎఫ్ఓ కోరుతోంది. సెప్టెంబర్ డెడ్‌లైన్ లోగా లింకింగ్ ప్రాసెస్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. తాజాగా ఆ గ‌డువును కేంద్రం డిసెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు పొడిగించింది. ఈ విష‌యాన్ని ఈపీఎఫ్ఓ ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపింది.

  ఒక‌వేళ మీరు డిసెంబ‌ర్ నెలాఖ‌రు లోగా మీ ఈపీఎఫ్ ఖాతాను ఆధార్‌తో అనుసంధానించ‌కుంటే మీ ఈపీఎఫ్ ఖాతాలోకి యాజ‌మాన్య వాటా చెల్లింపులు నిలిచిపోతాయి. అంతే కాదు.. అత్య‌వ‌స‌రాల కోసం ఈపీఎఫ్ ఖాతా నుంచి న‌గ‌దు విత్ డ్రాయ‌ల్ చేసుకోవ‌డంలోనూ మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఈపీఎఫ్‌వో సేవ‌ల‌ను కూడా ఉప‌యోగించుకోలేరు.

  Indian Railway: రైలు బోగీలు కొనుక్కోవచ్చు.. లీజుకు రైలు బోగీలు: రైల్వే శాఖ ప్రకటన


  పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయండి ఇలా

  ఈపీఎఫ్ ఖాతాదారులు ముందుగా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఓపెన్ చేయాలి.

  యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.

  ఆ తర్వాత Manage ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

  డ్రాప్‌డౌన్ మెనూలో KYC ఆప్షన్ క్లిక్ చేయాలి.

  కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

  అందులో Aadhaar సెలెక్ట్ చేయాలి.

  ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే పేరు, నెంబర్ ఎంటర్ చేయాలి.

  ఆ తర్వాత Save పైన క్లిక్ చేయాలి.

  ఓసారి వివరాలు సరిచూసుకోవాలి.

  మీ వివరాలు యూఐడీఏఐ డేటాతో క్రాస్ చెక్ చేసిన తర్వాత అప్రూవ్ అవుతుంది.

  అప్రూవ్ అయిన తర్వాత Verified అని కనిపిస్తుంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Aadhaar card, EPFO

  ఉత్తమ కథలు