కరోనా మహమ్మారి తీవ్ర సంక్షోభం సృష్టిస్తోంది. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,87,122 మంది మరణించారు. వీరిలో మధ్యతరగతి, చిరుద్యోగులే ఎక్కువ. ఈపీఎఫ్ ఖాతాదారులు ఉద్యోగంలో ఉండగా మరణిస్తే వారికి రూ.7,00,000 వరకు ఇన్స్యూరెన్స్ అందిస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్-EDLI పేరుతో ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. కరోనా కారణంగా ఈపీఎఫ్ ఖాతాదారులు మరణించినట్టైతే వారి కుటుంబ సభ్యులు ఈ స్కీమ్ ద్వారా ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా కనీసం రూ.2,50,000 ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. గరిష్టంగా రూ.7,00,000 వరకు బీమా పొందొచ్చు. గతంలో గరిష్ట పరిమితీ రూ.6,00,000 మాత్రమే ఉండేది. కానీ ఇటీవల బీమా మొత్తాన్ని రూ.7,00,000 చేసింది ఈపీఎఫ్ఓ.
ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు అందరికీ ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్-EDLI వర్తిస్తుంది. అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదంలో, ప్రకృతి విపత్తులో చనిపోతే సదరు ఈపీఎఫ్ ఖాతాదారు కుటుంబానికి రూ.7,00,000 వరకు బీమా మొత్తం లభిస్తుంది. కరోనా వైరస్ కారణంగా మరిణించినా ఈ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఇన్స్యూరెన్స్ పొందడానికి కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. సర్వీసులో ఉండగా మరణించిన ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్‌కు మాత్రమే ఈ ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ మరణించడానికి ముందు 12 నెలల కాలంలో ఒకటి కన్నా ఎక్కువ సంస్థల్లో పనిచేసినా వారి కుటుంబ సభ్యులు బీమా ప్రయోజనం పొందొచ్చు.
PAN Card: మీ పాన్ కార్డుపై ఉన్న 10 డిజిట్స్‌కి అర్థం తెలుసా?
EPF Withdrawal: కరోనాతో మరణించినవారి ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు డ్రా చేయండిలా
ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్-EDLI స్కీమ్ ప్రయోజనం పొందేందుకు ఈపీఎఫ్ ఖాతాదారులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. సంస్థ యాజమాన్యం మాత్రం బేసిక్ సాలరీలో 0.5% లేదా గరిష్టంగా రూ.75 ప్రతీ నెల చెల్లించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ ఖాతాదారులు మరణించినట్టైతే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్-EDLI స్కీమ్ ప్రయోజనాలు పొందేందుకు నామినీ అందుకు సంబంధించిన ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలి. దరఖాస్తు సబ్మిట్ చేసిన 30 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ అవుతుంది. మరి ఈ స్కీమ్ ద్వారా ఎవరికి ఎంత బీమా వస్తుందో లెక్కించడానికి ఓ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారం ఇన్స్యూరెన్స్ ఎంత లభిస్తుందో తెలుసుకోవచ్చు.
Gold Hallmarking: హాల్‌మార్కింగ్ అంటే ఏంటీ? ఎలా గుర్తించాలి? తెలుసుకోండి
SBI Zero Balance Account: ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయండిలా
ఈడీఎల్ఐ స్కీమ్ బేసిక్ వేతనం రూ.15,000 లోపు ఉన్న వారందరికీ వర్తిస్తుంది. బేసిక్ వేతనం రూ.15,000 దాటినా గరిష్టంగా రూ.7,00,000 లక్షల వరకే బీమా ఉంటుంది. చివరి 12 నెలల్లో ఉన్న బేసిక్ వేతనానికి 35 రెట్లు+రూ.1,75,000 బోనస్ ఇస్తారు. ఉదాహరణకు బేసిక్ వేతనం రూ.15,000 అయితే రూ.15,000x35= రూ.5,25,000 అవుతుంది. రూ.5,25,000+రూ.1,75,000 బోనస్‌తో కలిపి గరిష్టంగా రూ.7,00,000 మాత్రమే లభిస్తుంది. ఒకవేళ బేసిక్ వేతనం రూ.10,000 అయితే రూ.15,000x35= రూ.3,50,000 అవుతుంది. రూ.3,50,000+రూ.1,75,000 బోనస్‌తో కలిపి గరిష్టంగా రూ.5,25,000 లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid-19, EPFO, Insurance, Personal Finance