హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు షాక్... తగ్గిన వడ్డీ రేటు

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు షాక్... తగ్గిన వడ్డీ రేటు

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు షాక్... తగ్గిన వడ్డీ రేటు
(ప్రతీకాత్మక చిత్రం)

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు షాక్... తగ్గిన వడ్డీ రేటు (ప్రతీకాత్మక చిత్రం)

EPF Interest Rate 2019-20 | మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. 2019-20 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును భారీగా తగ్గించింది ఈపీఎఫ్ఓ.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF ఖాతాదారులకు అతిపెద్ద షాక్ ఇది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO వడ్డీ రేటును తగ్గించింది. ఏకంగా 15 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఖాతాదారులకు తీవ్ర నష్టం కలగనుంది. ఏకంగా 6 కోట్ల మంది ఖాతాదారులపై ఈ నిర్ణయం ప్రభావం చూపించనుంది. ప్రస్తుతం 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8.50 శాతానికి తగ్గిస్తూ ఈపీఎఫ్ఓకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించిన వడ్డీ ఇది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ వర్తిస్తుంది. 8.65 శాతంగా ఉన్న వడ్డీరేటును ఈసారి కూడా కొనసాగిస్తారన్న వార్తలొచ్చాయి. కానీ వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్స్ తగ్గించింది ఈపీఎఫ్ఓ.

ఓసారి ఈపీఎఫ్ వడ్డీ రేట్ల చరిత్ర చూస్తే 2012-13 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం, 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో 8.75 శాతం, 2015-16 లో 8.8 శాతం, 2016-17 లో 8.65 శాతం వడ్డీ ఉండేది. కానీ 2017-18 సంవత్సరంలో 8.55 శాతానికి వడ్డీని తగ్గించారు. ఆ తర్వాత 2018-19 ఆర్థిక సంవత్సరంలో వడ్డీని 8.65 శాతానికి పెంచడం కోట్లాది మది ఈపీఎఫ్ ఖాతాదారులకు మేలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2019-20 లో వడ్డీ రేటును 8.50 శాతానికి తగ్గించడం మాత్రం ఖాతాదారులకు వచ్చే వడ్డీకి గండి కొట్టినట్టే. ప్రభుత్వం నిర్వహిస్తున్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల సమాన స్థాయికి ఈపీఎఫ్ వడ్డీ రేట్లను తీసుకురావాలని కార్మిక శాఖను ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ తగ్గించడంతో ఖాతాదారులకు రావాల్సిన వడ్డీ తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి:

Save Money: మీకు రూ.1 కోటి కావాలంటే నెలనెలా జమ చేయండి ఇలా

EPF-Aadhaar Link: ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా

Pension Scheme: ఈ స్కీమ్‌తో నెలకు రూ.19,000 పెన్షన్ పొందండి ఇలా

First published:

Tags: BUSINESS NEWS, EPFO, Pension Scheme, Personal Finance

ఉత్తమ కథలు