సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ వడ్డీ జమ చేస్తున్నట్టు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజషన్ (EPFO) సర్క్యులర్ జారీ చేసింది. దీపావళి సందర్భంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ జమ చేస్తోంది. 25 కోట్ల ఈపీఎఫ్ అకౌంట్లలో వడ్డీ జమ చేస్తున్నట్టు ఈపీఎఫ్ఓ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇప్పటికే పలు ఈపీఎఫ్ అకౌంట్లలో వడ్డీ జమ అయింది. మరి మీ ఈపీఎఫ్ అకౌంట్లలో వడ్డీ జమ అయిందో లేదో తెలుసుకోవడానికి పాస్ బుక్ చెక్ చేయాల్సి ఉంటుంది. లేదా ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు. ఎంత వడ్డీ వచ్చిందో తెలుసుకోవాలంటే ఈపీఎఫ్ పాస్‌బుక్ చెక్ చేయాలి. ఎలాగో తెలుసుకోండి.
EPFO issues instructions to credit interest of 8.5% for the year 2020-21 into some 25.0 crore accounts of members with EPFO. Check circular here: https://t.co/778pixxyXp
@LabourMinistry @esichq @PIBHindi @PIB_India @FinMinIndia @wootaum
— EPFO (@socialepfo) November 1, 2021
ఈపీఎఫ్ అకౌంట్ పాస్‌బుక్ డౌన్లోడ్ చేయండి ఇలా
ఈపీఎఫ్ ఖాతాదారులు ముందుగా https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటే యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
లాగిన్ అయిన తర్వాత మీకు వేర్వేరు మెంబర్ ఐడీస్ ఉన్నట్టైతే ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీకి చెందిన ఐడీ సెలెక్ట్ చేయాలి.
మీకు పాత ఫార్మాట్, కొత్త ఫార్మాట్లో పాస్‌బుక్ అందుబాటులో ఉంటుంది.
మీకు ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో పాస్‌బుక్ డౌన్లోడ్ చేయాలి.
ఆ తర్వాత ఈపీఎఫ్ఓ జమ చేసిన వడ్డీ వివరాలు ఉంటాయి.
ఈపీఎఫ్ అకౌంట్ పాస్‌బుక్ డౌన్లోడ్ చేయకుండా బ్యాలెన్స్ చెక్ చేయడం ద్వారా కూడా వడ్డీ జమ అయిందో లేదో తెలుసుకోవచ్చు. అయితే వడ్డీ జమ కాకముందు మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో మీకు తెలిసుండాలి. అప్పుడే వడ్డీ ఎంత జమ అయిందో తెలుస్తుంది. ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి నాలుగు పద్ధతులు ఉన్నాయి. ఈపీఎఫ్ఓ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం, ఎస్ఎంఎస్ పంపడం ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో పాటు ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మరి ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.
SMS: ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి. తెలుగులో బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే EPFOHO UAN TEL అని టైప్ చేయాలి.
Missed Call: మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఎస్ఎంఎస్ ద్వారా మీ ఈపీఎఫ్ అకౌంట్ వివరాలు తెలుసుకోవచ్చు.
EPFO website: ఈపీఎఫ్ వెబ్సైట్లో బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. పైన చెప్పినట్టుగా ఈపీఎఫ్ పాస్‌బుక్ డౌన్లోడ్ చేసి బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు. ఈ పద్ధతి ద్వారా పాస్‌బుక్ డౌన్లోడ్ చేస్తే ఎంత వడ్డీ వచ్చిందో తెలుసుకోవడం సులువు. దీంతోపాటు మొత్తం బ్యాలెన్స్ ఎంత ఉంది, ప్రతీ నెలా ఎంత జమ అయిందో డీటెయిల్డ్‌గా తెలుస్తుంది.
Umang App: ఉమాంగ్ యాప్‌లో కూడా మీ పీఎఫ్ పాస్‌బుక్ చెక్ చేయొచ్చు. ఉమాంగ్ యాప్‌లో లాగిన్ అయిన తర్వాత ఈపీఎఫ్ పైన క్లిక్ చేయాలి. View Passbook పైన క్లిక్ చేసిన తర్వాత మీ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయాలి. మీ ఈపీఎఫ్ పాస్‌బుక్ కనిపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO, Personal Finance