హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPFO: షాక్... 9 లక్షల ఈపీఎఫ్ అకౌంట్లను బ్లాక్ చేసిన ఈపీఎఫ్ఓ

EPFO: షాక్... 9 లక్షల ఈపీఎఫ్ అకౌంట్లను బ్లాక్ చేసిన ఈపీఎఫ్ఓ

EPFO: షాక్... 9 లక్షల ఈపీఎఫ్ అకౌంట్లను బ్లాక్ చేసిన ఈపీఎఫ్ఓ
(ప్రతీకాత్మక చిత్రం)

EPFO: షాక్... 9 లక్షల ఈపీఎఫ్ అకౌంట్లను బ్లాక్ చేసిన ఈపీఎఫ్ఓ (ప్రతీకాత్మక చిత్రం)

EPFO Blocks Accounts | ప్రధాన మంత్రి రోజ్‌గార్ ప్రోత్సాహన్ యోజన పథకంలో భారీగా మోసాలు బయటపడటంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO సుమారు 9 లక్షల ఈపీఎఫ్ EPF అకౌంట్లను బ్లాక్ చేసింది.

  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO అతిపెద్ద స్కామ్‌ను గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రోత్సాహకాల కోసం 80,000 కంపెనీలు మోసాలకు పాల్పడ్డట్టు తేల్చింది. ప్రధాన మంత్రి రోజ్‌గార్ ప్రోత్సాహన్ యోజన-PMRPY పథకానికి చెందిన 9 లక్షల లబ్ధిదారుల అకౌంట్లను బ్లాక్ చేసినట్టు బిజినెస్ స్టాండర్డ్ ఓ కథనాన్ని పబ్లిష్ చేసింది. ఆ కథనం ప్రకారం అర్హతలు లేకపోయినా వారంతా ప్రధాన మంత్రి రోజ్‌గార్ ప్రోత్సాహన్ యోజన పథకంలో ప్రయోజనాలు పొందినట్టు ప్రభుత్వం గుర్తించింది. సుమారు రూ.300 కోట్ల ఆర్థిక ప్రోత్సాహకాలు పొందినట్టు తేలింది. వీటిలో ఇప్పటికే రూ.222 కోట్ల రూపాయలను ఆయా కంపెనీల నుంచి రికవరీ చేసింది ప్రభుత్వం. అంతేకాదు... సుమారు 9 లక్షల ఈపీఎఫ్ అకౌంట్లను ఈపీఎఫ్ఓ బ్లాక్ చేసేసింది.

  కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించిన కంపెనీలకు ఆర్థికంగా ప్రోత్సాహకాలు అందించేందుకు 2016 సంవత్సరంలో ప్రధాన మంత్రి రోజ్‌గార్ ప్రోత్సాహన్ యోజన పథకం ప్రారంభమైంది. కొత్తగా ఉద్యోగాలు కల్పించిన కంపెనీల తరఫున ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ మూడేళ్ల పాటు 12 శాతం చొప్పున ప్రభుత్వమే చెల్లించే పథకం ఇది. 2016 ఏప్రిల్ 1 నుంచి నెలకు రూ.15,000 మించి వేతనం ఉన్న కొత్త ఉద్యోగులను ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేస్తేనే ఈ పథకం వర్తిస్తుంది. అయితే చాలా కంపెనీలు పాత ఉద్యోగులకే కొత్తగా ఉద్యోగాలు కల్పించినట్టు వెల్లడించి ఈపీఎఫ్ఓ పేరోల్ డేటాబేస్‌లో వివరాలను అప్‌డేట్ చేశాయి. ఇలా ఈ పథకం నుంచి లబ్ధి పొందినవారిలో 9 లక్షల మంది ఈ స్కీమ్ రాకముందే సంఘటిత రంగంలో పనిచేస్తున్నారని, స్కీమ్ వచ్చిన తర్వాత వీరిని క్రమబద్ధీకరించినట్టు మోసాలకు పాల్పడ్డారని విచారణలో బయటపడింది. వారంతా ఈ పథకానికి అనర్హులని తేలింది. దీంతో ఈపీఎఫ్ఓ ఈ ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్లను బ్లాక్ చేసింది.

  ఇవి కూడా చదవండి:

  SBI Alert: ఈ తప్పుతో డబ్బులు పోతాయి... హెచ్చరిస్తున్న ఎస్‌బీఐ

  Debit Card: మీ ఫోన్‌ లాగా ఏటీఎం కార్డును స్విచ్చాఫ్ చేయొచ్చు ఇలా

  Pension Scheme: ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే నెలకు రూ.10,000 పెన్షన్

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: BUSINESS NEWS, EPFO, Pension Scheme, Personal Finance

  ఉత్తమ కథలు