మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (EPF Account) ఉందా? ప్రతీ నెలా మీ ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నారా? ఈపీఎఫ్ అకౌంట్లో జమ చేసే డబ్బుల్ని అవసరానికి డ్రా చేసుకోవచ్చని అందరికీ తెలుసు. కానీ ఈపీఎఫ్ అకౌంట్ ద్వారా లభించే ఇతర ప్రయోజనాల గురించి అవగాహన తక్కువే. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందొచ్చు. అంతేకాదు... ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ (EDLI) లభిస్తుందన్న విషయం అందరికీ తెలియదు. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ (EDLI) ద్వారా ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు రూ.7 లక్షల వరకు ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. పీఎఫ్, పెన్షన్, ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ పొందాలంటే ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు తప్పనిసరిగా తమ నామినీ వివరాలు అప్డేట్ చేయాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కోరుతోంది.
7th Pay Commission: ఆ ఉద్యోగులకు రూ.17,951 బోనస్ ప్రకటించిన కేంద్రం... దసరా, దీపావళి బొనాంజా
ట్విట్టర్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు అవగాహన కల్పిస్తోంది ఈపీఎఫ్ఓ. ఆన్లైన్లోనే ఇ-నామినేషన్ ఫైల్ చేసే సదుపాయాన్ని కూడా కల్పించింది. ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో కేవలం ఐదు నిమిషాల్లో ఇ-నామినేషన్ ఫైల్ చేయొచ్చు. అయితే యూఏఎన్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ పనిచేస్తూ ఉండాలి. మీ ఇ-నామినేషన్ ఈపీఎఫ్ఓ దగ్గర రిజిస్టర్ అవుతుంది. కాబట్టి మీరు మీ ప్రస్తుత యజమాని, మాజీ యజమానికి మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ పంపాల్సిన అవసరం లేదు. మరి ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో ఇ-నామినేషన్ ఎలా ఫైల్ చేయాలో తెలుసుకోండి.
Why one should file e-Nomination?#SocialSecurity #EPF #PF #EDLI #Pension #ईपीएफओ pic.twitter.com/x6FpqkiSS5
— epfowarangal (@epfowarangal) October 12, 2021
EPF Account: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్... దీపావళి లోపు గుడ్ న్యూస్
Step 1- ముందుగా https://www.epfindia.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో Service ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
Step 3- అందులో For Employees ఆప్షన్ క్లిక్ చేయాలి.
Step 4- ఆ తర్వాత Member UAN/ Online Service (OCS/OTP) ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 5- యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
Step 6- ఆ తర్వాత Manage Tab పైన క్లిక్ చేయాలి.
Step 7- E-nomination ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 8- ఫ్యామిలీ డిక్లరేషన్ ఆప్షన్ దగ్గర Yes ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 9- Add Family Details క్లిక్ చేసి అవసరమైన వివరాలు ఎంటర్ చేయాలి. నామినీగా ఒకరికన్నా ఎక్కువ మందిని యాడ్ చేయొచ్చు.
Step 10- ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో పర్సెంటేజ్ ఎంటర్ చేయాలి.
Step 11- ఆ తర్వాత Save EPF Nomination పైన క్లిక్ చేయాలి.
Step 12- తర్వాతి పేజీలో E-sign జనరేట్ చేయాలి.
Step 13- మీ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
Step 14- ఓటీపీ ఎంటర్ చేస్తే నామినీ వివరాలు అప్డేట్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO, Personal Finance