Home /News /business /

EPFO ASKS ACCOUNT HOLDERS TO UPDATE THEIR BANK ACCOUNT AND IFSC CODE TO SETTLE CLAIMS SS

EPFO: అకౌంట్‌లోకి పీఎఫ్ డబ్బులు రాలేదా? కారణాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

EPF Pandemic Advance Facility | మీరు ఈపీఎఫ్ క్లెయిమ్‌కు దరఖాస్తు చేశారా? ఇంకా డబ్బులు అకౌంట్లోకి రాలేదా? ఏం చేయాలో తెలుసుకోండి.

    కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ నుంచి అడ్వాన్స్ తీసుకునే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO పాండమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీని ప్రారంభించింది. ఇప్పటికే లక్షలాది మంది క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అనేక మందికి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి కూడా. సాధారణంగా 3 రోజుల్లోనే క్లెయిమ్ సెటిల్ చేస్తోంది ఈపీఎఫ్ఓ. బ్యాంకులు 1 నుంచి 3 రోజుల్లో డబ్బుల్ని అకౌంట్‌లో డిపాజిట్ చేస్తోంది. కానీ... కొందరికి క్లెయిమ్ ప్రాసెస్‌లు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దరఖాస్తు చేసి చాలారోజులైనా అకౌంట్‌లోకి డబ్బులు రావట్లేదు. ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్ కాకపోవడానికి పలు కారణాలున్నాయి. అందులో బ్యాంకు అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్‌ని అకౌంట్ హోల్డర్లు అప్‌డేట్ చేయకపోవడమే.


    కోవిడ్ 19 పాండమిక్ క్లెయిమ్‌కు దరఖాస్తు చేసినవాళ్లు వెంటనే ఈపీఎఫ్ఓ మెంబర్స్ పోర్టల్‌లో బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ అప్‌డేట్ చేయాలని కోరుతోంది ఈపీఎఫ్ఓ. మీ ఎంప్లాయర్ అప్రూవల్‌లో బ్యాంకు అకౌంట్ నెంబర్‌ను అప్‌డేట్ చేయొచ్చని సూచిస్తోంది. అంతేకాదు మీ అకౌంట్ యాక్టీవ్‌లో ఉందో లేదో కూడా చెక్ చేయాలి. మీ అకౌంట్ యాక్టీవ్‌లో లేకపోయినా క్లెయిమ్ ట్రాన్స్‌ఫర్‌లో సమస్యలు వస్తాయి. బ్యాంకు అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తప్పుగా ఉంటే డబ్బులు మళ్లీ బ్యాంకులకు వెనక్కి వెళ్తాయని హెచ్చరిస్తోంది ఈపీఎఫ్ఓ. కోవిడ్ 19 పాండమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీ ద్వారా ఈపీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్‌లో ఉన్న మొత్తంలో 75% లేదా మూడు నెలల బేసిక్+డీఏ వీటిలో ఏది తక్కువ అయితే అది విత్‌డ్రా చేసుకోవచ్చు. గత నెలలో 12.91 లక్షల క్లెయిమ్స్ వస్తే అందులో 7.40 లక్షల క్లెయిమ్స్ పాండమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీ ఆప్షన్‌తో అప్లై చేసినవే.

    ఇవి కూడా చదవండి:

    EPF Withdrawal: మీ పీఎఫ్ డబ్బులు 3 రోజుల్లో మీ అకౌంట్‌లోకి... విత్‌డ్రా చేయండి ఇలా

    EPF: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి రూ.6 లక్షల వరకు ఇన్స్యూరెన్స్

    EPF Claim: ఈపీఎఫ్ విత్‌డ్రాలో సమస్యలున్నాయా? ఇలా చేయండి
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Business, BUSINESS NEWS, EPFO, Personal Finance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు