హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF: 40 ఏళ్ల కనిష్ఠానికి EPF వడ్డీ రేటు.. అయినా ఇతర పథకాల కంటే ఈపీఎఫ్‌ బెస్ట్‌.. ఎందుకంటే!

EPF: 40 ఏళ్ల కనిష్ఠానికి EPF వడ్డీ రేటు.. అయినా ఇతర పథకాల కంటే ఈపీఎఫ్‌ బెస్ట్‌.. ఎందుకంటే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

EPF: ఈపీఎఫ్‌ఓ 2021-22 ఆర్థిక సంవత్సరానికి అందిస్తున్న 8.1 శాతం వడ్డీ రేటు 40 ఏళ్లలో అతి తక్కువ వడ్డీ రేటు కావడం గమనార్హం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇది 8.5 శాతంగా ఉంది.

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ-Employees Provident Fund Organisations)లో దాదాపు ఐదు కోట్ల మంది సభ్యులకు 8.1 శాతం వడ్డీ రేటును అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు పదవీ విరమణ సంఘం శుక్రవారం ప్రకటించింది. ఈపీఎఫ్‌ఓ 2021-22 ఆర్థిక సంవత్సరానికి అందిస్తున్న 8.1 శాతం వడ్డీ రేటు 40 ఏళ్లలో అతి తక్కువ వడ్డీ రేటు కావడం గమనార్హం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇది 8.5 శాతంగా ఉంది. వడ్డీ రేటును తగ్గించడంపై విమర్శలు ఎదురవుతుండటంతో నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా ప్రయత్నించారు. ఆమె మాట్లాడుతూ..‘ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం ఇంకా రాలేదు. అయితే ఇవి ఈ రోజు అమలులో ఉన్న రేట్లు. మిగిలిన వాటి కంటే EPFO ఇప్పటికీ ఎక్కువగా ఉంది’ అని పేర్కొన్నారు.

2021-22 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు మునుపటి 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించారు. దీన్ని సమర్థించుకునేందుకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF), సుకన్య సమృద్ధి యోజన(SSY), సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్(SCSS), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేటులను ఆర్థిక మంత్రి ఉదాహరణగా చూపారు.

* ఇతర ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ల కంటే EPF ఎక్కువ

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌ చర్చల తర్వాత ప్రతి సంవత్సరం వడ్డీ రేటును ప్రకటిస్తారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ దానిని ఆమోదించిన తర్వాత ఇది ఉద్యోగుల ఖాతాకు జమ అవుతుంది. కార్మిక మంత్రి, కార్మిక సంఘాల సభ్యులు, ఇతర వాటాదారులతో కూడిన పాలకమండలి మార్చి 13న 2021-22 ఆర్థిక సంవత్సరానికి రేటును ప్రకటించింది.

ఇది కూడా చదవండి : గ్యాస్ సబ్సిడీపై కేంద్రం క్లారిటీ.. వారికి మాత్రమే.. మిగతా వాళ్లు ఎంత చెల్లించాలంటే..

40 ఏళ్లలో EPFO ప్రకటించిన అతి తక్కువ రేటుగా ఇది నిలిచింది. దీనిపై EPFO 60 మిలియన్ల సభ్యులు లేదా జీతాలు తీసుకునే ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ EPF అలాగే దాని పొడిగింపు VPF (వాలంటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌)పై ప్రభావం కూడా అనివార్యం.

ఇతర సురక్షితమైన, స్థిర ఆదాయ మార్గాల కంటే EPFO ఎందుకు మేలంటే..

* EPF కాంట్రిబ్యూషన్‌ తప్పనిసరి

వ్యక్తి బేసిక్ శాలరీలో 12 శాతం EPF కాంట్రిబ్యూషన్‌(డియర్‌నెస్ అలవెన్స్ ఏదైనా ఉంటే) తప్పనిసరి. ఈ మొత్తాన్ని నిర్ణయించే అధికారం ఉద్యోగికి ఉండదు. ఉద్యోగం చేస్తున్న సంస్థ ఈ మొత్తాన్ని మినహాయిస్తుంది. అయినప్పటికీ అధిక మొత్తంలో వాలంటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌(VPF)ను మినహాయించుకునేలా ఉద్యోగులు సూచించవచ్చు. రిటైర్‌మెంట్‌ తర్వాత అందే రాబడిపై పన్ను ప్రయోజనాలు అందుకునేందుకు వీపీఎఫ్‌ను ఎక్కువ మంది ఎంచుకుంటారు.

* ఇతర పథకాలతో పోలిస్తే ప్రస్తుత రేటు ఎక్కువే..

40 ఏళ్లలో తక్కువగా 8.1 శాతం వడ్డీ రేటును అందిస్తున్నా.. ఇది పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలు, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల రాబడిని మించిపోయింది. ఈ ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ స్కీమ్‌లు సురక్షితమైనవి, కచ్చితమైన రాబడిని అందిస్తాయి. అయితే ఆ పథకాలలో అందే రాబడి ఈపీఎఫ్‌తో పోలిస్తే తక్కువగా ఉంది.

ఇది కూడా చదవండి : కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లో డబ్బులు పడబోతున్నాయ్.. ఫుల్ డిటెయిల్స్

ఉదాహరణకు అత్యంత ప్రజాదరణ పొందిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తుంది, అయితే సుకన్య సమృద్ధి యోజన పథకంలో 7.6 శాతం పొందవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌(SCSS), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10-సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లు వరుసగా సంవత్సరానికి 7.4 శాతం, 5.5 శాతం వడ్డీ రేటును చెల్లిస్తున్నాయి.

* అనేక పన్ను ప్రయోజనాలు

ఇతర పథకాల కంటే EPF రేటు ఎక్కువగా ఉండటమే కాకుండా ఎక్కువ పన్ను ప్రయోజనాలు అందుతాయి. EPF పెట్టుబడిలపై మెచ్చూరిటీ సమయంలో పన్ను విధించరు. అయితే లభించే వడ్డీ రూ. 2.5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక PF సహకారాన్ని సెక్షన్ 80C కింద మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు.

సంవత్సరానికి రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ కాంట్రిబ్యూట్‌ చేస్తన్నా లేదా అధిక VPF కాంట్రిబ్యూషన్‌ ద్వారా ఈ పరిమితిని ఉల్లంఘిస్తే తప్ప వడ్డీపై పన్ను విధించరు. మెచ్యూరిటీ సమయంలో స్వీకరించే మొత్తం కూడా పన్ను రహితంగా ఉంటుంది. SCSS, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ మీకు వర్తించే స్లాబ్ రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. PPF, సుకన్య సమృద్ధి యోజన, EPF మాదిరిగానే పన్ను ప్రయోజనాలను అందిస్తాయి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Central Government, Epf, EPFO, Interest rates, Nirmala sitharaman, PPF

ఉత్తమ కథలు