హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPFO: ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ హెచ్చరిక.. ఆ తప్పులు అస్సలు చేయొద్దని సూచన.. వివరాలివే..

EPFO: ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ హెచ్చరిక.. ఆ తప్పులు అస్సలు చేయొద్దని సూచన.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పీఎఫ్​ అకౌంట్ల(PF Account) లోని అమౌంట్​ను కూడా నేరగాళ్లు వదలడం లేదు. అందుకే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆన్​లైన్​ మోసాల(Frauds) గురించి సభ్యులను హెచ్చరిస్తూ కొన్ని సూచనలు చేసింది.

ఇటీవలి కాలంలో సైబర్​ నేరాలు(Cyber Crimes) ఎక్కువయ్యాయి. సైబర్​ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ బ్యాంక్​ అకౌంట్లలో ఉన్న డబ్బు లూటీ చేస్తున్నారు. ఫోన్​, మెసేజెస్(Messages)​, ఈ–మెయిల్(E-Mail), క్యూఆర్​ కోడ్ (QR Code), లాటరీ ఇలా వివిధ మార్గాల్లో ఖాతాదారుల డబ్బు కాజేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు బ్యాంక్​ అకౌంట్ల(Bank Accounts) పై దృష్టి సారించిన నేరగాళ్లు.. ఇప్పుడు పీఎఫ్​ అకౌంట్ల(PF Account) లోని అమౌంట్​ను కూడా వదలడం లేదు. అందుకే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆన్​లైన్​ మోసాల(Frauds) గురించి సభ్యులను హెచ్చరిస్తూ కొన్ని సూచనలు చేసింది. నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ఉండేందుకు ఈపీఎఫ్​ ఖాతా(EPF Account), వ్యక్తిగత వివరాలు, ఓటీపీ(OTP) వంటి ముఖ్యమైన వివరాలను ఫోన్ లేదా ఆన్‌లైన్‌లో పంచుకోవద్దని సభ్యులను కోరింది.

ఇటీవలి కాలంలో ఈపీఎఫ్​ లింక్డ్ ఓటీపీల ద్వారా మోసాలు పెరుగుతున్నందున ఈపీఎఫ్​ఓ తాజా హెచ్చరిక జారీ చేసింది. ఈపీఎఫ్​ఓ నుంచి కాల్​ చేస్తున్నామని ఎవరైనా చెబితే, వారికి మీ ఆధార్ కార్డ్ నంబర్, పాన్​ నంబర్​, బ్యాంక్ ఖాతా నంబర్, UAN నంబర్ వంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని కోరింది. కేవలం కాల్​ ద్వారానే కాదు వాట్సాప్ లేదా ఏ ఇతర సోషల్ మీడియా యాప్స్​ ద్వారా ఇతరులతో మీ వ్యక్తిగత వివరాలు పంచుకోకూడదని హెచ్చరించింది. ఈ మేరకు ఈపీఎఫ్​ఓ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్వీట్​ చేస్తూ “#EPFO తన సభ్యులను ఆధార్, పాన్, UAN, బ్యాంక్ ఖాతా లేదా OTP వంటి వ్యక్తిగత వివరాలను ఫోన్ లేదా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయమని ఎప్పుడూ అడగదు. దయచేసి గమనించండి. సైబర్​ నేరగాళ్ల వలలో చిక్కి మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్​ కోల్పోకండి.” అని ట్వీట్‌లో పేర్కొంది.

EPF Interest: ఈపీఎఫ్ అకౌంట్‌కు వడ్డీ జమ చేయడంలో ఆలస్యం.. అసలు కారణం ఇదే..

ఈ ట్వీట్‌తో పాటు, ఈపీఎఫ్​ఓ “మోసగాళ్ల పట్ల హెచ్చరిక” పేరుతో ​​ఒక ఫోటోను కూడా షేర్ చేసింది. ఈపీఎఫ్​ఓ ఏ సర్వీస్​ కోసం అయినా.. ​​ఎప్పుడూ మీ నుంచి డబ్బు డిపాజిట్ చేయమని అడగదని ట్వీట్​లో పేర్కొంది. అందువల్ల, వాట్సాప్​ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​ల ద్వారా మీ ఈపీఎఫ్​ఓ వివరాలను పంపకూడదని సలహా ఇచ్చింది.

EPFO: పీఎఫ్ చందాదారులకు శుభవార్త.. వడ్డీపై ఆర్థిక శాఖ కీలక నిర్ణయం.. ఈ సారి ఎంతంటే..

డాక్యుమెంట్లను డిజిలాకర్​లో భద్రపర్చుకోండి..

కాగా.. ఈపీఎఫ్​ఓకు సంబంధిన ఏవైనా సమస్యలపై ఫిర్యాదు చేయాలంటే EPFO ​​అధికారిక వెబ్‌సైట్ - www.epfindia.gov.inని సంప్రదించమని కోరింది. అలాగే, మీ అన్ని వ్యక్తిగత డాక్యుమెంట్లను డిజిలాకర్‌లో భద్రపర్చుకోండని తెలిపింది. డిజిలాకర్​ మీ డాక్యుమెంట్​లకు మరింత భద్రతనిస్తుంది. డిజిలాకర్​ సురక్షితమైన క్లౌడ్ ఆధారిత ప్రభుత్వ ప్లాట్‌ఫారమ్. దీనిలో మీ డాక్యుమెంట్లకు సేఫ్టీ ఉంటుంది. అందువల్ల, డిజిలాకర్​లో UAN కార్డ్, పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (PPO), స్కీమ్ సర్టిఫికేట్ వంటివి భద్రపర్చుకోండి.

First published:

Tags: CYBER CRIME, Employees, Employees Provident Fund Organisation, EPFO

ఉత్తమ కథలు