EPF Withdrawal: ఈపీఎఫ్ విత్‌డ్రా నిబంధనలు మారాయి... కొత్త రూల్స్ ఇదే

ప్రతీకాత్మక చిత్రం

EPF Withdrawal | కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? డబ్బులకు ఇబ్బంది అవుతుందా? మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు ఇలా.

  • Share this:
    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉన్నవారికి శుభవార్త. ఈపీఎఫ్ విత్‌డ్రాయల్‌లో కొత్త రూల్ అమలులోకి వచ్చింది. గతవారం ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం రెండు శుభవార్తలు చెప్పిన సంగతి తెలిసిందే. 100 మంది ఉద్యోగులు ఉన్న చిన్న సంస్థల్లో రూ.15,000 లోపు వేతనం తీసుకుంటున్నవారికి ఎంప్లాయీ షేర్ 12%, ఎంప్లాయర్ షేర్ 12% మూడు నెలల పాటు ప్రభుత్వమే చెల్లిస్తుందని మొదటి శుభావార్త చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75% లేదా మూడు నెలల వేతనంలో ఏది తక్కువ అయితే అది నాన్ రీఫండబుల్ అడ్వాన్స్‌గా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ మరో గుడ్ న్యూస్ చెప్పారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగులు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టైతే వారిని ఈపీఎఫ్ అకౌంట్‌లోని డబ్బులు ఆదుకోనున్నాయి.

    కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో కార్మిక శాఖ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO విత్‌డ్రా నిబంధనల్ని మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సుమారు 6 కోట్ల మంది ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు నాన్-రీఫండబుల్ అడ్వాన్స్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఈ నోటిఫికేషన్. ప్యారా 68 ఎల్‌లోని సబ్ ప్యారా (3) ద్వారా ఈఫీఎఫ్ ఖాతాదారులు నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ తీసుకోవచ్చని, 2020 మార్చి 28 నుంచి ఇది అమలులోకి వచ్చిందని ఈపీఎఫ్ఓ సర్క్యులర్ జారీ చేసింది. అంటే ఇన్నాళ్లూ పెళ్లి, ఉన్నత విద్య, ఇంటి నిర్మాణం లాంటి కారణాలతో అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు కరోనా వైరస్ సంక్షోభాన్ని ఓ కారణంగా చూపిస్తూ అడ్వాన్స్ తీసుకోవచ్చు. మరి మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. ఏఏ కారణాలతో ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    Banks Merger: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? అయితే అలర్ట్

    WhatsApp Banking: బ్యాంకులో పని ఉందా? మీ వాట్సప్‌లోనే సేవలు పొందండి ఇలా

    Good News: లోన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్... భారీగా తగ్గనున్న ఈఎంఐలు
    Published by:Santhosh Kumar S
    First published: