హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF Withdrawal: మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయండి ఇలా

EPF Withdrawal: మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయండి ఇలా

EPF Withdrawal | మీరు ఆన్‌లైన్‌లో విత్‌డ్రా చేయాలనుకుంటే మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌-UAN ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్‌తో లింకై ఉండాలి. ఇది తప్పనిసరి.

EPF Withdrawal | మీరు ఆన్‌లైన్‌లో విత్‌డ్రా చేయాలనుకుంటే మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌-UAN ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్‌తో లింకై ఉండాలి. ఇది తప్పనిసరి.

EPF Withdrawal | మీరు ఆన్‌లైన్‌లో విత్‌డ్రా చేయాలనుకుంటే మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌-UAN ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్‌తో లింకై ఉండాలి. ఇది తప్పనిసరి.

  మీ జీతం నుంచి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్‌లో నెలనెలా డబ్బులు జమ చేస్తున్నారా? ఈపీఎఫ్‌లోని డబ్బులు మీకు రిటైర్మెంట్ సమయంలోనే కాదు... అంతకన్నా ముందు కూడా ఉపయోగపడతాయి. మీ ఆర్థిక అవసరాలను బట్టి ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. పాక్షికంగా లేదా మొత్తంగా కూడా ఈపీఎఫ్ విత్‌డ్రా చేయడానికి అనుమతి ఇస్తుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO. ఆన్‌లైన్‌లో మీరే స్వయంగా ఈపీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు. ఈపీఎఫ్ఓ ఈ అవకాశం కల్పిస్తోంది. సులువుగా క్లెయిమ్ సెటిల్మెంట్ జరిగేలా ఆన్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈపీఎఫ్ఓ. గతంలో అయితే పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేయాలనుకుంటే అందుకు గల కారణాలను వివరించడంతో పాటు డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉండేది. కానీ... ఇప్పుడు అలాంటి నిబంధనలేవీ లేవు.

  మీరు ఆన్‌లైన్‌లో విత్‌డ్రా చేయాలనుకుంటే మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌-UAN ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్‌తో లింకై ఉండాలి. ఇది తప్పనిసరి. మీ యజమాని ధృవీకరణ అవసరం లేదు. మీరే నేరుగా క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు. ఇక మీ యూఏఎన్ యాక్టివేట్ అయి ఉండాలి. మీ యూఏఎన్ అకౌంట్‌కు లింకైన మొబైల్ నెంబర్ పనిచేస్తూ ఉండాలి. ఆ తర్వాత మీరు యూఏఎన్ పోర్టల్ ఓపెన్ చేసి మీ వివరాలతో లాగిన్ కావాలి. ఆ తర్వాత క్లెయిమ్ ఫామ్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. పాక్షికంగా విత్‌డ్రా చేస్తున్నట్టైతే ఎందుకోసమో కారణం వివరించాలి. మీ క్లెయిమ్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత 10-15 రోజుల్లో డబ్బులు మీ అకౌంట్‌లో జమ అవుతాయి. అయితే కొన్ని కారణాలకు మాత్రమే ఈపీఎఫ్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఏఏ కారణాలతో ఈపీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయొచ్చో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

  Redmi K20 Pro: తక్కువ ధర, అదిరిపోయిన ఫీచర్స్... రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి

  ఇవి కూడా చదవండి:

  EPF-Aadhaar: మీ పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేస్తే లాభమిదే

  Train Timings: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఈ రైళ్ల టైమింగ్స్ మారాయి

  ATM Card: జనవరి 1 నుంచి ఈ ఏటీఎం కార్డులు పనిచేయవు... మార్చుకోండి

  First published:

  Tags: BUSINESS NEWS, EPFO, Personal Finance

  ఉత్తమ కథలు