హోమ్ /వార్తలు /business /

EPF Withdrawal: కరోనాతో మరణించినవారి ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు డ్రా చేయండిలా

EPF Withdrawal: కరోనాతో మరణించినవారి ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు డ్రా చేయండిలా

EPF Withdrawal | ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ కరోనాతో మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసుకోండి.

EPF Withdrawal | ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ కరోనాతో మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసుకోండి.

EPF Withdrawal | ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ కరోనాతో మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసుకోండి.

    గత ఏడాదిగా కరోనా మరణాలు పెరిగిపోతున్నాయి. భారతదేశంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య నేటి వరకు 2,78,719. వీరిలో దినసరి కూలీల నుంచి ధనవంతుల వరకు ఉన్నాయి. ఉద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా క్లెయిమ్ చేసుకోవాలన్న సందేహాలు ఉన్నాయి. సాధారణంగా రిటైర్మెంట్ తర్వాత లేదా ప్రత్యేక పరిస్థితుల్లో ఈపీఎఫ్ అకౌంట్ నుంచి మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఈపీఎఫ్ అకౌంట్‌లోని డబ్బులు క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు జమ చేసిన ఉద్యోగి వాటా, యజమాని వాటా, వడ్డీ మాత్రమే కాదు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్-EDLI స్కీమ్ ద్వారా ఉద్యోగి కుటుంబ సభ్యులకు రూ.7,00,000 వరకు బీమా డబ్బులు లభిస్తాయి. మరి చనిపోయినవారి ఈపీఎఫ్ అకౌంట్ నుంచి వారి కుటుంబ సభ్యులు డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసుకోండి.

    Gold Hallmarking: హాల్‌మార్కింగ్ అంటే ఏంటీ? ఎలా గుర్తించాలి? తెలుసుకోండి

    Postinfo: పోస్ట్ ఆఫీస్ సేవల కోసం ఈ యాప్... ఇలా వాడుకోండి

    ఉద్యోగి కుటుంబ సభ్యులు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయడానికి ఈపీఎఫ్ ఫామ్ 20 సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్‌తో పాటు పలు డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ పేరు, తండ్రి లేదా భర్త పేరు, సంస్థ పేరు, అడ్రస్, ఈపీఎఫ్ అకౌంట్ నెంబర్, ఉద్యోగంలో చివరి రోజు, ఉద్యోగం మానెయ్యడానికి కారణం అంటే మరణించారు అని వెల్లడించాలి. దీంతో పాటు ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ పుట్టిన తేదీ, మ్యారిటల్ స్టేటస్ లంటి వివరాలు రాయాలి. ఇక ఉద్యోగి అకౌంట్ నుంచి డబ్బులు క్లెయిమ్ చేసుకోవాలనుకునే వ్యక్తులు కూడా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. క్లెయిమ్ చేసే వ్యక్తి పేరు, తండ్రి పేరు లేదా భర్త పేరు, జెండర్, వయస్సు, మారిటల్ స్టేటస్, చనిపోయిన వ్యక్తితో ఉన్న సంబంధం, పూర్తి పోస్టల్ అడ్రస్ లాంటి వివరాలు వెల్లడించాలి. దీంతో పాటు పోస్టల్ మనీ ఆర్డర్ ద్వారా డబ్బులు పొందాలనుకుంటే ఆ కాలమ్ టిక్ చేయాలి. లేదా అకౌంట్ ద్వారా పొందాలనుకుంటే అకౌంట్ వివరాలు, క్యాన్సల్డ్ చెక్ సబ్మిట్ చేయాలి.

    SBI Zero Balance Account: ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయండిలా

    SBI Loan: ఎస్‌బీఐ యోనో యాప్‌లో వెంటనే లోన్లు

    ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. క్లెయిమ్ ప్రాసెస్‌లో పలు దశల్లో ఎస్ఎంఎస్‌లు వస్తాయి. బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు పొందడానికి క్యాన్సల్డ్ చెక్ ఇవ్వడం తప్పనిసరి. పూర్తి అడ్రస్ పిన్‌కోడ్‌తో సహా వెల్లడించాలి. ఉద్యోగి ఈపీఎఫ్ అకౌంట్‌లో ఉన్న డబ్బులను డ్రా చేయడానికి ఫామ్ 20 ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఈపీఎఫ్, ఈపీఎస్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్-EDLI స్కీమ్ ద్వారా రావాల్సిన డబ్బుల కోసం ఫామ్ 10C/D కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని ఫామ్ సబ్మిట్ చేయాలి. ఫామ్ సబ్మిట్ చేసిన 30 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ అవుతుంది.

    First published:

    ఉత్తమ కథలు