అర్జెంట్‌గా డబ్బులు అవసరం అయినప్పుడు స్నేహితులు, బంధువుల దగ్గర అప్పు తీసుకుంటారు. లేదా బ్యాంకుల్లో లోన్ తీసుకుంటారు. ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత అప్పు దొరకకపోతే పీఎఫ్ డబ్బుల్ని విత్‌డ్రా (PF Money Withdrawal) చేయాలని ఆలోచిస్తారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆన్‌లైన్‌లోనే ఈపీఎఫ్ డబ్బుల్ని విత్‌డ్రా చేసే సదుపాయాన్ని ఈపీఎఫ్ అకౌంట్‌హోల్డర్స్‌కు ఇస్తోంది. ఉద్యోగులు తమ జీతం నుంచి ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేసిన డబ్బుల్ని తమకు అవసరం ఉన్నప్పుడు విత్‌డ్రా చేయొచ్చు. అనుకోని పరిస్థితుల కారణంగా అత్యవసరంగా డబ్బులు అవసరం అయినప్పుడు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి సులువుగా డబ్బులు డ్రా చేయొచ్చు.
ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు అడ్వాన్స్ విత్‌డ్రాయల్ ఆప్షన్ అందిస్తోంది. ఎప్పుడైనా ఈ ఆప్షన్ ద్వారా డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉద్యోగులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈపీఎఫ్ అడ్వాన్ తీసుకున్న తర్వాత మళ్లీ ఆ డబ్బుల్ని ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేసే అవకాశం ఉండదు. అందుకే అత్యవసరమైతే తప్ప ఈ ఆప్షన్ ఉపయోగించుకోకూడదు. మరి ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ డబ్బుల్ని వెనక్కి ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.
Step 1- ముందుగా ఈపీఎఫ్ఓ సేవా పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఓపెన్ చేయాలి.
Step 2- యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN), పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
Step 3- ఆన్‌లైన్ సర్వీసెస్‌లో Claim (Form-31, 19 & 10C) లింక్ పైన క్లిక్ చేయాలి.
Step 4- బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
Step 5- నియమనిబంధనలు అంగీరకించి Proceed for Online Claim పైన క్లిక్ చేయాలి.
Step 6- ఆ తర్వాత I Want to Apply For పైన క్లిక్ చేయాలి.
Step 7- రిటైర్మెంట్‌కు ముందు డబ్బులు విత్‌డ్రా చేస్తారు కాబట్టి PF Advance (Form 31) ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 8- అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి క్లెయిమ్ సబ్మిట్ చేయాలి.
మీరు క్లెయిమ్ సబ్మిట్ చేసిన 15 నుంచి 20 రోజుల్లో మీ బ్యాంక్ అకౌంట్‌లో పీఎఫ్ డబ్బులు జమ అవుతాయి. వేర్వేరు కారణాలతో ఈపీఎఫ్ డబ్బుల్ని విత్‌డ్రా చేయొచ్చు. ఇంటి నిర్మాణం, ఇంటి కొనుగోలు, ఫ్లాట్ లేదా స్థలం కొనుగోలు, పిల్లల చదువు, పెళ్లి, ఆస్పత్రి ఖర్చులు, ఇతర కారణాలు సూచించి మీ పీఎఫ్ డబ్బుల్ని వెనక్కి తీసుకోవచ్చు.
Aadhaar Name Update: ఆధార్ కార్డుపై పేరు మార్చాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవండి
అయితే దీర్ఘకాలం పాటు పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తే రిటైర్మెంట్ నాటికి కార్పస్ ఎక్కువగా జమ అవుతుందని, అసలుతో పాటు వడ్డీ కూడా అధికంగా వస్తుందని పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్ చెబుతుంటారు. అందుకే అత్యవసరం అయితే తప్ప పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయకూడదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loan, Epf, EPFO, Personal Finance, Personal Loan