EPFO: ఉద్యోగం మారారా? ఈపీఎఫ్ అకౌంట్ ఆటోమెటిక్‌గా ట్రాన్స్‌ఫర్

EPFO | ప్రస్తుతం ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఉద్యోగం మారగానే ఈపీఎఫ్ క్లెయిమ్స్‌ని బదిలీ చేసేందుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ప్రతీ ఏడాది ఈపీఎఫ్ఓకు ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్‌ల కోసం 8 లక్షల దరఖాస్తులు వస్తున్నాయి.

news18-telugu
Updated: March 11, 2019, 1:05 PM IST
EPFO: ఉద్యోగం మారారా? ఈపీఎఫ్ అకౌంట్ ఆటోమెటిక్‌గా ట్రాన్స్‌ఫర్
EPFO: ఉద్యోగం మారారా? ఈపీఎఫ్ అకౌంట్ ఆటోమెటిక్‌గా ట్రాన్స్‌ఫర్
news18-telugu
Updated: March 11, 2019, 1:05 PM IST
ఉద్యోగులకు శుభవార్త. ఇకపై మీరు ఉద్యోగం మారిన ప్రతీసారీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPF) అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఉద్యోగం మారగానే మీ ఈపీఎఫ్ అకౌంట్ కూడా ఆటోమెటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం ఇది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ తాజా నిబంధన అమలులోకి వచ్చేస్తుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఉద్యోగం మారగానే ఈపీఎఫ్ క్లెయిమ్స్‌ని బదిలీ చేసేందుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ప్రతీ ఏడాది ఈపీఎఫ్ఓకు ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్‌ల కోసం 8 లక్షల దరఖాస్తులు వస్తున్నాయి.

ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ ఆటోమేషన్‌ను ఈపీఎఫ్ఓ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా ఈ సదుపాయం సబ్‌స్క్రైబర్లు అందరికీ అందుబాటులోకి తీసుకువస్తాం. పేపర్‌లెస్ ఆర్గనైజేషన్‌గా మార్చేందుకు C-DAC సహాయంతో కలిసి ఈపీఎఫ్ఓ కృషి చేస్తోంది. 80 శాతం పనులన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోనున్నాయి. ఈపీఎఫ్ ఆటోమెటిక్‌గా ట్రాన్స్‌ఫర్ చేయడం అందులో ఒకటి.
కేంద్ర కార్మిక శాఖ సీనియర్ అధికారి


కొత్త సంస్థలో చేరిన తర్వాత ఈపీఎఫ్ ప్రక్రియ మొదలుకాగానే యూఏఎన్ నెంబర్ ఆధారంగా పాత ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్, వడ్డీ ఆటోమెటిక్‌గా బదిలీ అవుతాయి. దీని వల్ల గత సంస్థలో పనిచేసిన పదవీకాలంలో పొందిన ప్రయోజనాలన్నీ కొనసాగుతాయి.



Photos: ఈ 50 లగ్జరీ కార్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే...

ఇవి కూడా చదవండి:

Realme 3 Sale: రేపే రియల్‌మీ 3 సేల్... ధర రూ.8,999... జియో నుంచి రూ.5,300 బెనిఫిట్స్

డిగ్రీ ఉంటే చాలు... బ్యాంక్ ఆఫ్ బరోడాలో 100 ఉద్యోగాలు...

Good News: ఏప్రిల్ 1 నుంచి తగ్గనున్న ఇన్స్యూరెన్స్ ప్రీమియం

మీ దగ్గరున్న నోటు నకిలీదా? ఒరిజినలా? స్మార్ట్‌ఫోన్ యాప్‌తో గుర్తించొచ్చు
First published: March 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...