కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Cases) కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభించినప్పుడు ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడూ మరోసారి వైరస్ ప్రభావం చూపిస్తుండటంతో ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు. ఇలాంటి సమయంలో ఉద్యోగుల్ని ఎంప్లాయీస్ ప్రావెడిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆదుకుంటోంది. వైరస్ సోకి ఆస్పత్రిపాలైన ఉద్యోగులు ఈపీఎఫ్ఓ నుంచి మెడికల్ అడ్వాన్స్ తీసుకోవచ్చు.
ఉద్యోగులు తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (EPF Account) నుంచి మెడికల్ అడ్వాన్స్ తీసుకునే వెసులుబాటు గతేడాది కల్పించింది ఈపీఎఫ్ఓ. ఇందుకోసం కొన్ని కొత్త రూల్స్ అమలు చేసింది. అత్యవసర వైద్య చికిత్స, ఆస్పత్రి ఖర్చుల కోసం ఉద్యోగులు తమ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి రూ.1,00,000 వరకు అడ్వాన్స్‌ను కేవలం ఒక్కరోజులోనే పొందొచ్చు. దరఖాస్తు చేయడానికి ఈపీఎఫ్ ఖాతాదారులు ఆస్పత్రి ఖర్చులు, చికిత్సకు సంబంధించిన ఎస్టిమేషన్ ముందుగా ఇవ్వాల్సిన అవసరం లేదు.
Credit Cards: క్రెడిట్ కార్డుకు అప్లై చేస్తున్నారా? క్యాష్‌బ్యాక్ ఇచ్చే కార్డులు ఇవే
ఉద్యోగులు రూ.1,00,000 మెడికల్ అడ్వాన్స్ పొందడానికి కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. సదరు పేషెంట్ ప్రభుత్వ, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్‌లో ఉన్న ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. ఒకవేళ పేషెంట్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్టైతే మెడికల్ బిల్స్‌ని రీఇంబర్స్ చేయాలంటూ సంబంధిత అధికారుల్ని కోరాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ మంజూరు చేసే మొత్తం నేరుగా ప్రైవేట్ ఆస్పత్రి అకౌంట్‌లో జమ అవుతుంది.
ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగి ఆస్పత్రి పాలైతే వారి కుటుంబ సభ్యులు మెడికల్ అడ్వాన్స్ కోసం అప్లై చేయొచ్చు. ఒకవేళ ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆస్పత్రి పాలైతే సదరు ఉద్యోగి మెడికల్ అడ్వాన్స్ కోసొచ్చు. ఆస్పత్రి వివరాలు, పేషెంట్ వివరాలతో ఈపీఎఫ్ఓకు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు పరిశీలించిన తర్వాత అధికారులు రూ.1,00,000 వరకు మెడికల్ అడ్వాన్స్ మంజూరు చేస్తారు. ఈ డబ్బులు దరఖాస్తుదారుల అకౌంట్‌లోకి లేదా ఆస్పత్రి అకౌంట్‌లోకి జమ అవుతుంది.
IRCTC Tour: రాజస్తాన్ వెళ్తారా? ఫ్లైట్ టూర్ ప్యాకేజీ అందిస్తున్న ఐఆర్‌సీటీసీ
ఆస్పత్రి ఖర్చులు రూ.1,00,000 దాటినా అదనపు అడ్వాన్స్ కోసం దరఖాస్తు చేయొచ్చు. అదనపు అడ్వాన్స్ కోసం దరఖాస్తు చేయాలంటే ఎస్టిమేషన్ ఇవ్వడం తప్పనిసరి. ఎస్టిమేషన్ అప్పుడు అందుబాటులో లేకపోయినా పేషెంట్‌ను డిశ్చార్జ్ చేసేలోపు వివరాలను ఈపీఎఫ్ఓకు సమర్పించాలి. ఇక పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత 45 రోజుల్లో మెడికల్ బిల్స్ మొత్తం సబ్మిట్ చేయాలి. ఫైనల్ బిల్ పరిశీలించిన తర్వాత మెడికల్ అడ్వాన్స్‌ను అడ్జెస్ట్ చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.