హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPFO: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి షాక్... వడ్డీ తగ్గిస్తే నష్టమే

EPFO: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి షాక్... వడ్డీ తగ్గిస్తే నష్టమే

EPFO: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి షాక్... వడ్డీ తగ్గిస్తే నష్టమే
(ప్రతీకాత్మక చిత్రం)

EPFO: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి షాక్... వడ్డీ తగ్గిస్తే నష్టమే (ప్రతీకాత్మక చిత్రం)

EPFO | 2019-20 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును తగ్గించడం వైపే ఈపీఎఫ్ఓ మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఈపీఎఫ్ఓ వడ్డీ తగ్గిస్తే అది ఈపీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూసే.

  మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉందా? మీ జీతం నుంచి నెలనెలా ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తున్నారా? అయితే త్వరలో మీరో బ్యాడ్ న్యూస్ వినొచ్చు. ఈపీఎఫ్ వడ్డీ రేటు తగ్గించే ఆలోచనలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అది కూడా ఏకంగా 15 నుంచి 25 బేసిస్ పాయింట్స్ తగ్గే అవకాశముంది. అంటే పావు శాతం వడ్డీ తగ్గితే ఆ ప్రభావం లక్షలాది మంది ఈపీఎఫ్ ఖాతాదారులపై పడనుంది. తాము దాచుకున్న డబ్బుపై వడ్డీ తక్కువగా వస్తుంది. 2018-19 సంవత్సరానికి వడ్డీ రేటు 8.65 శాతం అని గతంలోనే ప్రకటించింది ఈపీఎఫ్ఓ. వడ్డీ రేటును 8.65 శాతంగా నిర్ణయించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖతో ఏడు నెలల పాటు చర్చలు జరిపింది. ఆర్థిక శాఖ పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినా ఈపీఎఫ్ఓ మాత్రం 8.65 శాతానికే ఫిక్సయింది.

  త్వరలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఎగ్జిక్యూటీవ్ కమిటీ మెంబర్స్, అధికారులు చర్చించి 2019-20 ఆర్థిక సంవత్సరానికి కొత్త వడ్డీ రేటును ప్రకటించే అవకాశం ఉంది. జనవరి నెలాఖరు లోగా ఈపీఎఫ్ఓ వడ్డీరేటుపై నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఆర్థిక మందగమనం, డెట్ మార్కెట్ నుంచి లాభాలు తక్కువగా ఉండటం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం లాంటి కారణాల వల్ల ఈపీఎఫ్ వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును తగ్గించడం వైపే ఈపీఎఫ్ఓ మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఈపీఎఫ్ఓ వడ్డీ తగ్గిస్తే అది ఈపీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూసే. ఈ నిర్ణయం లక్షలాది మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు నష్టం కలిగించేదే. ఏటా ఈపీఎఫ్ఓ నుంచి వచ్చే వడ్డీ తగ్గిపోతుంది.

  ఇవి కూడా చదవండి:

  EPF Withdrawal: మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయండి ఇలా

  Save Money: నెలకు రూ.5,000 పొదుపు... మీ అకౌంట్‌లో రూ.1 కోటి రిటర్న్స్... పొందండి ఇలా

  EPFO: మీకు రెండు పీఎఫ్ అకౌంట్లు ఉన్నాయా? కలిపేస్తే లాభమిదే...

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: BUSINESS NEWS, EPFO, Personal Finance

  ఉత్తమ కథలు