హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tax Savings: కొత్త పన్ను విధానంలో ట్యాక్స్‌ ఎలా సేవ్‌ చేయాలి? ఉద్యోగులకు నిపుణుల సూచనలివే

Tax Savings: కొత్త పన్ను విధానంలో ట్యాక్స్‌ ఎలా సేవ్‌ చేయాలి? ఉద్యోగులకు నిపుణుల సూచనలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్-2023లో న్యూ ట్యాక్స్‌ స్ట్రక్చర్‌కి చాలా మార్పులను ప్రతిపాదించారు. ఈ సవరణలు 2023–2024 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Tax Savings: ప్రస్తుతం పన్ను పరిధిలోకి వచ్చే భారతీయులు రెండు పద్ధతుల్లో ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయవచ్చు. ఇందుకు పాత, కొత్త పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. కొత్త పన్ను విధానాన్నే అందరూ వినియోగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్-2023లో న్యూ ట్యాక్స్‌ స్ట్రక్చర్‌కి చాలా మార్పులను ప్రతిపాదించారు. ఈ సవరణలు 2023–2024 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. మరికొన్ని రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కొత్తగా అమల్లోకి రానున్న మార్పులు ఏంటి, కొత్త పన్ను విధానంలో ట్యాక్స్‌ ఎలా సేవ్‌ చేసుకోవచ్చు వంటి వివరాలు పరిశీలిద్దాం.

కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్‌ డిడక్షన్‌

2023-24 బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఈ మార్పుతో ఉద్యోగులు అందరూ కొత్త పన్ను విధానానికి మారుతారని నిపుణులు భావించారు. అయితే ఈ విధానంలో ఇన్వెస్ట్‌మెంట్‌లపై ఎగ్జమ్షన్స్‌ లభించవు.

తాజా మార్పులతో రూ.3 లక్షల వరకు ఉన్న ఇన్‌కమ్‌పై ఎలాంటి పన్ను విధించరు. రూ.3లక్షల నుంచి రూ.6 లక్షల మధ్య ఇన్‌కమ్‌పై 5 శాతం పన్ను ఉంటుంది. రూ.6- రూ.9 లక్షలకు 10 శాతం, రూ.9లక్షల నుంచి రూ.12 లక్షలపై 15 శాతం, రూ.12లక్షల నుంచి రూ.15 లక్షలకు 20 శాతం పన్ను విధిస్తారు. రూ. 15 లక్షలు ఆపైన ఆదాయం ఉంటే 30 శాతం పన్ను ఉంటుంది. అంతేకాకుండా కొత్త పన్ను విధానంలో రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ని ప్రభుత్వం ప్రకటించింది.

ట్యాక్స్ ఎలా సేవ్‌ చేయాలి?

InvestoXpert.com ఎండీ విశాల్ రహేజా న్యూస్‌18తో మాట్లాడుతూ.. ‘ఈ సంవత్సరం బడ్జెట్ కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు వారి ఆదాయంపై రూ.7 లక్షల వరకు ఎగ్జమ్షన్‌ ప్రకటించింది. రూ.50,000 స్టాండర్డ్‌ డిడక్షన్‌ అందుబాటులో ఉంది. అంటే రూ.7.5 లక్షలకు ఎగ్జమ్షన్‌ పొందుతున్నట్లు భావించాలి. దానికి మించి ఎగ్జమ్షన్‌ పొందాలంటే చాలా తక్కువ ఆప్షన్‌లు ఉన్నాయి.’ అని చెప్పారు.

Business idea: మీరు కోటీశ్వరులు కావాలంటే ఈ చెట్లను పెంచుకోండి.. ఒక్క ఎకరం కోటి సంపాదిస్తుంది..

ట్యాక్స్‌ సేవింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌

పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 80 CCD(2) వంటి టూల్స్‌ని ఉపయోగించుకోవచ్చని రహేజా తెలిపారు. సెక్షన్ 80 CCD(2) ఆదాయ పన్ను నుంచి 10 శాతం వరకు బేసిక్‌ శాలరీతో పాటు డియర్‌నెస్ అలవెన్స్‌ను మినహాయిస్తుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు 14 శాతంగా ఉంది. కొత్త పన్ను విధానంలో శాలరీలో 12 శాతంగా చేస్తున్న EPF కాంట్రిబ్యూషన్‌లు పన్ను పరిధిలోకి రావు.

కొత్త పన్ను విధానం ఉపయోగించాలని భావిస్తున్న ఉద్యోగులు పోర్ట్‌ఫోలియోను పునర్నిర్మించాలి. ఇంతకుముందు PPFను ఎక్కువగా ట్యాక్స్‌ సేవింగ్‌ ఆప్షన్‌గా భావించేవారు. కొత్త నిబంధనల ప్రకారం, PPF కాంట్రిబ్యూషన్‌లు పన్ను పరిధిలోకి వస్తాయి. కానీ PPF అకౌంట్‌ మెచ్యూరిటీ అమౌంట్‌, సంపాదించిన వడ్డీపై పన్ను ఉండదు.

ఇతర ఆప్షన్‌లు

ఉద్యోగులు ట్యాక్స్‌ చేయడానికి ఇన్వెస్ట్‌మెంట్‌ కమ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను పరిశీలించవచ్చు. ముఖ్యంగా హై నెట్‌ వర్త్‌ ఇండివిడ్యువల్స్‌కి పన్ను ఆదా చేయడంలో ఉపయోగపడతాయి. అయితే యులిప్ పాలసీలు ఇప్పటికీ పన్ను పరిధిలోకి వస్తాయని గమనించాలి.

ప్రాపర్టీలను అద్దెకు ఇచ్చిన ఉద్యోగులు యాన్యువల్‌ ప్రాపర్టీ వ్యాల్యూలో 30 శాతం స్టాండర్డ్‌ డిడక్షన్‌ క్లెయిమ్‌ చేయవచ్చు. ఇదే క్రమంలో ఫైనాన్షియల్‌ బిల్‌ 2023కి ప్రభుత్వం సవరణలు తీసుకువచ్చింది. వార్షిక ఆదాయం రూ.7 లక్షల కంటే తక్కువగా ఉన్న పన్ను చెల్లింపుదారులకు 'మార్జినల్‌ రిలీప్‌' ఇచ్చింది. మార్జినల్‌ రిలీఫ్‌ పొందే థ్రెషోల్డ్ ఇన్‌కమ్‌ను ప్రభుత్వం ప్రకటించలేదు.

First published:

Tags: Income tax

ఉత్తమ కథలు