హోమ్ /వార్తలు /బిజినెస్ /

PF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? సింపుల్‌గా తెలుసుకోండి ఇలా

PF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? సింపుల్‌గా తెలుసుకోండి ఇలా

PF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? సింపుల్‌గా తెలుసుకోండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

PF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? సింపుల్‌గా తెలుసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

EPF Pandemic advance facility | మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? తెలుసుకోవాలనుకుంటున్నారా? జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే చాలు. ఎస్ఎంఎస్ పంపినా మీ ఈపీఎఫ్ అకౌంట్‌లోని బ్యాలెన్స్ తెలుస్తుంది.

కరోనా వైరస్ సంక్షోభం కారణంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO. ఇందుకోసం ఈపీఎఫ్ పాండమిక్ అడ్వాన్స్ ఫెలిసిలిటీని లిస్ట్‌లో చేర్చింది. 15 రోజుల్లో 3.31 లక్షల క్లెయిమ్స్‌ని సెటిల్ చేసింది ఈపీఎఫ్ఓ. రూ.946.49 కోట్లను ఈపీఎఫ్ ఖాతాదారులకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇంకా లక్షల్లో క్లెయిమ్స్ వస్తున్నాయి. వాటినీ సెటిల్ చేసే పనిలో ఉంది ఈపీఎఫ్ఓ. అయితే ఈపీఎఫ్ అకౌంట్‌లో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసుకున్న తర్వాతే క్లెయిమ్‌కు దరఖాస్తు చేయడం మంచిది. ఈపీఎఫ్ అకౌంట్‌లో ఉన్న మొత్తం 75 శాతం లేదా మూడు నెలల బేసిక్ వేతనంలో ఏది తక్కువ అయితే అది డ్రా చేసుకునే అవకాశం ఉంది. మరి ఇది లెక్కించాలంటే మీ ఈపీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ ఎంతో తెలుసుకోవాలి. బ్యాలెన్స్ తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపినా, మిస్డ్ కాల్ ఇచ్చినా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుస్తుంది. ఇవి మాత్రమే కాదు ఇంకే వేర్వేరు మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.

Missed Call: మిస్డ్ కాల్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ యూఏఎన్ అకౌంట్‌తో రిజిస్టరై ఉండాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా తెలుస్తాయి.

SMS: ఎస్ఎంఎస్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే మీ యూఏఎన్ నెంబర్‌తో ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ లాంటి కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయడం తప్పనిసరి. అప్పుడే మీరు ఎస్ఎంఎస్ ద్వారా పీఎప్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఈ వివరాలు తెలుగులో కావాలంటే EPFOHO UAN TEL అని టైప్ చేసి మెసేజ్ పంపాలి.

EPFO Portal: ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ https://www.epfindia.gov.in/ ఓపెన్ చేయాలి. Our Services ట్యాబ్‌లో for employees సెలెక్ట్ చేయాలి. Services ఆప్షన్‌లో Member passbook ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో UAN నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ఈపీఎఫ్ పాస్‌బుక్ చూడొచ్చు.

Umang App: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉమాంగ్ యాప్ ఓపెన్ చేసి ఈపీఎఫ్‌ఓకు సంబంధించిన వివరాలన్నీ చూడొచ్చు.

ఈ పద్ధతుల ద్వారా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఎంత డ్రా చేసుకునే అవకాశం ఉందో లెక్కించొచ్చు. అయితే ఈపీఎఫ్ అకౌంట్ నుంచి అత్యవసరమైతే తప్ప డబ్బులు డ్రా చేయకూడదు. ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకుంటే తప్ప మీ ఆర్థిక సమస్యలు తీరవనుకుంటేనే క్లెయిమ్‌కు అప్లై చేయాలి. మరి క్లెయిమ్ ఎలా చేయాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

PF Balance: పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? ఎంత నష్టమంటే

EPF Claim: ఈపీఎఫ్ విత్‌డ్రాలో సమస్యలున్నాయా? ఇలా చేయండి

Moratorium: 3 ఈఎంఐలు వాయిదా వేస్తే ఇంకా ఎక్కువ ఈఎంఐలు కట్టాలి

First published:

Tags: Business, BUSINESS NEWS, Corona, Corona virus, Coronavirus, Covid-19, EPFO, Lockdown, Personal Finance, Save Money

ఉత్తమ కథలు