హోమ్ /వార్తలు /బిజినెస్ /

PF withdrawal: పీఎఫ్ విత్‌డ్రా చేయాలంటే ఈ 3 తప్పనిసరి

PF withdrawal: పీఎఫ్ విత్‌డ్రా చేయాలంటే ఈ 3 తప్పనిసరి

PF withdrawal: పీఎఫ్ విత్‌డ్రా చేయాలంటే ఈ 3 తప్పనిసరి
(ప్రతీకాత్మక చిత్రం)

PF withdrawal: పీఎఫ్ విత్‌డ్రా చేయాలంటే ఈ 3 తప్పనిసరి (ప్రతీకాత్మక చిత్రం)

EPF withdrawal application | మీరు ఈపీఎఫ్ డబ్బులు డ్రా చేయాలనుకుంటున్నారా? క్లెయిమ్‌కు దరఖాస్తు చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.

  కరోనా వైరస్ మహమ్మారి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తోంది. దీంతో ఇన్నాళ్లూ పొదుపు చేసిన డబ్బుల్ని ఆర్థిక అవసరాలకు వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్‌లో దాచుకున్న డబ్బుల్ని విత్‌డ్రా చేస్తున్నారు ఉద్యోగులు. అయితే ఈపీఎఫ్ డబ్బుల్ని విత్‌డ్రా చేయడంలో సమస్యలు వస్తున్నాయి. దీంతో వారి క్లెయిమ్ సెటిల్మెంట్ మధ్యలోనే ఆగిపోతోంది. అందుకే ఉద్యోగులు ఈపీఎఫ్ క్లెయిమ్‌కు దరఖాస్తు చేసేముందు వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా 3 అంశాలను ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు గుర్తుంచుకోవాలి. ఆ మూడు వివరాల్లో ఏది సరిగ్గా లేకపోయినా ఈపీఎఫ్ క్లెయిమ్ సాధ్యం కాదు.

  EPF Claim: ఈపీఎఫ్ విత్‌డ్రా డబ్బులు రాలేదా? కంప్లైంట్ చేయండి ఇలా

  మొదటిది యూనివర్సల్ అకౌంట్ నెంబర్-UAN యాక్టివేట్ చేసి ఉండాలి. ఈపీఎఫ్ సభ్యులు తమకు యూఏఎన్ రాగానే ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. యూఏఎన్ యాక్టివేట్ చేయకుండా క్లెయిమ్‌కు దరఖాస్తు చేయడం కుదరదు. ఇక రెండోది యూఏఎన్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడంతో పాటు వెరిఫై చేయాలి. మూడోది బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ యూఏఎన్‌తో లింక్ చేసి ఉండాలి. ఈ మూడూ కరెక్ట్‌గా ఉంటేనే ఈపీఎఫ్ క్లెయిమ్‌ ప్రాసెస్ సక్సెస్ అవుతుంది. వీటిలో ఏది సరిగ్గా లేకపోయినా క్లెయిమ్ సెటిల్మెంట్ పెండింగ్‌లోనే ఉంటుంది.

  EPF New Rule: ఈపీఎఫ్ కొత్త రూల్‌తో మీకు లాభమిదే

  ఈపీఎఫ్ పాండమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీ ద్వారా ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్‌లో 75 శాతం లేదా మూడు నెలల బేసిక్ వేతనంలో ఏది తక్కువ అయితే అది మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత యూఏఎన్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. ఆన్‌లైన్ సర్వీసెస్‌లో క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకోవాలి. కొత్త పేజీ అవుతుంది. వివరాలన్నీ సరిచూసుకొని బ్యాంక్ అకౌంట్‌లోని చివరి నాలుగు అంకెల్ని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.

  EPFO: ఈ విషయం తెలిస్తే ఈపీఎఫ్ ఖాతాదారులకు రూ.50,000 లాభం

  బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేసిన తర్వాత Proceed for online claim పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత PF advance (Form 31) సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. డ్రాప్ డౌన్ మెనూలో Outbreak of pandemic (COVID-19) కారణాన్ని ఎంచుకోవాలి. చెక్ కాపీ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. అడ్రస్ ఎంటర్ చేయాలి. మీ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి క్లెయిమ్ రిక్వెస్ట్ సబ్మిట్ చేయాలి. మూడు రోజుల్లో ఈపీఎఫ్ డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతాయి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Business, BUSINESS NEWS, EPFO, Personal Finance

  ఉత్తమ కథలు