హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPFO: ఈ స్టెప్స్‌తో మీ పీఎఫ్ డబ్బులు ఈజీగా విత్‌డ్రా చేయొచ్చు

EPFO: ఈ స్టెప్స్‌తో మీ పీఎఫ్ డబ్బులు ఈజీగా విత్‌డ్రా చేయొచ్చు

EPFO: ఈ స్టెప్స్‌తో మీ పీఎఫ్ డబ్బులు ఈజీగా విత్‌డ్రా చేయొచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)

EPFO: ఈ స్టెప్స్‌తో మీ పీఎఫ్ డబ్బులు ఈజీగా విత్‌డ్రా చేయొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

EPF Pandemic advance facility | మీ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలనుకుంటున్నారా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవండి.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ఇటీవల కరోనా వైరస్ పాండమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కారణంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF ఖాతాదారులు తమ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్‌సైట్‌లో క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లెయిమ్ చేయడానికి ముందు ఈపీఎఫ్ ఖాతాదారుల యూఏఎన్ యాక్టివేట్ అయి ఉండాలి. ఆధార్ నెంబర్ యూఏఎన్‌తో లింక్ చేయాలి. బ్యాంకు అకౌంట్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ యూఏఎన్‌లో నమోదు చేయాలి. ఖాతాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75% లేదా మూడు నెలల బేసిక్+డీఏలో ఏది తక్కువ అయితే అది విత్‌డ్రా చేసుకోవచ్చు. అందుకే ముందుగా మీ పీఎఫ్ అకౌంట్‌లో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసుకోవాలి. మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మరి పీఎఫ్ డబ్బులు క్లెయిమ్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవండి.

ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి.

ఆ తర్వాత Online Services లో Claim(Form-31,19,10C & 10D) పైన క్లిక్ చేయండి.

మీరు గతంలో యూఏఎన్ పోర్టల్‌లో నమోదు చేసిన బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ను మరోసారి ఎంటర్ చేసి వెరిఫై చేయండి.

ఆ తర్వాత Proceed For Online Claim పైన క్లిక్ చేయండి.

డ్రాప్ డౌన్‌లో PF Advance (Form 31) సెలెక్ట్ చేయండి.

డ్రాప్ డౌన్‌లో పలు కారణాలు ఉంటాయి. వాటిలో Outbreak of pandemic (COVID-19) సెలెక్ట్ చేయండి.

మీకు ఎంత మొత్తం కావాలో ఎంటర్ చేయండి.

ఆ తర్వాత స్కాన్ చేసిన చెక్ లేదా బ్యాంకు పాస్‌బుక్ అప్‌లోడ్ చేయండి.

మీ అడ్రస్ ఎంటర్ చేయండి.

ఆ తర్వాత Get Aadhaar OTP పైన క్లిక్ చేయండి.

మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ క్లెయిమ్ సబ్మిట్ అవుతుంది.

సాధారణంగా రెండు మూడు రోజుల్లోనే మీ క్లెయిమ్ సెటిల్ అవుతుంది. బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు క్రెడిట్ అవుతాయి. ఏవైనా సమస్యలు ఉంటే క్లెయిమ్ సెటిల్ కాదు. ఒకవేళ మీ క్లెయిమ్ సెటిల్ కాకపోతే ఏం చేయాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

Job Loss: ఉద్యోగం పోతే ప్రభుత్వం నుంచి సాయం... పొందండి ఇలా

Lockdown: లాక్‌డౌన్‌లో బాగా నడిచిన బిజినెస్ ఇదే... వ్యాపారం చేయడానికి ప్రభుత్వ సాయం

Cylinder Booking: వాట్సప్ ద్వారా సిలిండర్ బుకింగ్... చేయండి ఇలా

First published:

Tags: Business, BUSINESS NEWS, Corona, Corona virus, Coronavirus, Covid-19, EPFO, Lockdown, Personal Finance

ఉత్తమ కథలు