EPF withdrawal: ఈపీఎఫ్ అకౌంట్ల నుంచి ఎంత విత్‌డ్రా చేశారో తెలుసా?

EPF withdrawal: ఈపీఎఫ్ అకౌంట్ల నుంచి ఎంత విత్‌డ్రా చేశారో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

EPF Pandemic advance facility | ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ 15 రోజుల్లో ఎంత విత్‌డ్రా చేశారో తెలుసుకోండి.

  • Share this:
    కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ల నుంచి విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈమేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO పాండమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీని ప్రారంభించింది. దీంతో ఉద్యోగులు ఈపీఎఫ్ అకౌంట్లలోని డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి క్లెయిమ్స్ చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పటివరకు ఎన్ని క్లెయిమ్స్ వచ్చాయో తెలుసా? 15 రోజుల్లో 10.02 లక్షల క్లెయిమ్స్ రాగా అందులో 6.06 లక్షల క్లెయిమ్స్ కోవిడ్ 19 అడ్వాన్సులకు సంబంధించినవి. 15 రోజుల్లో మొత్తం రూ.3,600.85 కోట్లను ట్రాన్స్‌ఫర్ చేసింది ఈపీఎఫ్ఓ. చాలావరకు క్లెయిమ్స్‌ని మూడు రోజుల్లోనే సెటిల్ చేస్తున్నామని కార్మిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

    మార్చి 26న కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా సంఘటిత రంగంలోని ఉద్యోగులకు రెండు వరాలు ప్రకటించింది. ఈపీఎఫ్ అకౌంట్‌లోని బ్యాలెన్స్‌లో 75 శాతం లేదా మూడు నెలల బేసిక్ వేతనం+డీఏ ఇందులో ఏది తక్కువ అయితే అది విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది కేంద్రం. కరోనా వైరస్ సంక్షోభాన్ని కారణంగా చూపించి పాండమిక్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఇక దీంతో పాటు 100 లోపు ఉద్యోగులు ఉన్న చిన్న సంస్థల్లో రూ.15,000 లోపు వేతనం ఉన్నవారికి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీ షేర్ 12%, ఎంప్లాయర్ షేర్ 12% మూడు నెలల పాటు ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

    ఇవి కూడా చదవండి:

    EPF Withdrawal: ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయడానికి స్టెప్స్ ఇవే

    PF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? సింపుల్‌గా తెలుసుకోండి ఇలా

    PF Balance: పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీస్తున్నారా? ఎంత నష్టమంటే
    Published by:Santhosh Kumar S
    First published: