EPF New Rules: గుడ్ న్యూస్... మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి ఎంత డ్రా చేసుకోవచ్చంటే

EPF withdrawal rules 2020 | చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న చిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ విత్‌డ్రా నిబంధనల్ని మార్చింది.

news18-telugu
Updated: March 27, 2020, 8:57 AM IST
EPF New Rules: గుడ్ న్యూస్... మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి ఎంత డ్రా చేసుకోవచ్చంటే
Good News: గుడ్ న్యూస్... మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి ఎంత డ్రా చేసుకోవచ్చంటే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ లాక్‌డౌన్‌తో ఏర్పడ్డ సంక్షోభం కారణంగా చిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. వారికి ఊరట కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీని ప్రకటించారు. అందులో భాగంగా సంఘటిత రంగంలో పనిచేస్తున్న చిరుద్యోగులకు వరాలు కురిపించారు. రూ.15,000 లోపు వేతనం ఉన్న ఉద్యోగులకు ఎంప్లాయీస్ షేర్‌, ఎంప్లాయర్ షేర్‌ను ప్రభుత్వమే చెల్లిస్తుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 100 లోపు ఉద్యోగులు ఉన్న చిన్న సంస్థలకు మాత్రమే వరిస్తుంది. అంటే 100 లోపు ఉద్యోగులు ఉన్న చిన్న సంస్థలో రూ.15,000 లోపు వేతనంతో పనిచేస్తున్నవారు ఈ నిర్ణయంతో లబ్ధిపొందుతారు. వారికి ఎంప్లాయీ షేర్ 12%, ఎంప్లాయర్ షేర్ 12% ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇలా మూడు నెలలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది.

ఇక పీఎఫ్ విత్‌డ్రా నిబంధనల్ని కూడా మార్చింది కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75% లేదా మూడు నెలల వేతనం... వీటిలో ఏది తక్కువ అయితే అది నాన్ రీఫండబుల్ అడ్వాన్స్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చు. 4.8 కోట్ల మంది ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం కారణంగా ఉద్యోగులు ఎవరైనా డబ్బులు లేక ఇబ్బందులు పడితే వారు పీఎఫ్ నుంచి సులువుగా విత్‌డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే కాకుండా ఇంటి నిర్మాణం, పెళ్లి లాంటి కారణాలకు ఇప్పటికే అడ్వాన్స్ తీసుకునే సదుపాయం ఉంది. ఏఏ కారణాలతో ఎంతెంత డ్రా చేసుకోవచ్చో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. అసలు మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

PM Gareeb Kalyan: పీఎం గరీబ్ కళ్యాణ్ స్కీమ్‌తో లాభాలు వీళ్లకే



SBI: ఖాతాదారులకు షాక్... ఆ ఛార్జీలు పెంచిన ఎస్‌బీఐ... మార్చి 31 నుంచి అమలులోకి

Coronavirus Effect: టీవీ, స్మార్ట్‌ఫోన్‌లో సినిమాలు చూస్తున్నారా? మీకు బ్యాడ్ న్యూస్
First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు