హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPFO e-passbook: ఈపీఎఫ్ఓ కొత్త ఇ-పాస్‌బుక్ వచ్చేసింది... ఇలా డౌన్‌లోడ్ చేయాలి

EPFO e-passbook: ఈపీఎఫ్ఓ కొత్త ఇ-పాస్‌బుక్ వచ్చేసింది... ఇలా డౌన్‌లోడ్ చేయాలి

EPFO e-passbook: ఈపీఎఫ్ఓ కొత్త ఇ-పాస్‌బుక్ వచ్చేసింది... ఇలా డౌన్‌లోడ్ చేయాలి
(ప్రతీకాత్మక చిత్రం)

EPFO e-passbook: ఈపీఎఫ్ఓ కొత్త ఇ-పాస్‌బుక్ వచ్చేసింది... ఇలా డౌన్‌లోడ్ చేయాలి (ప్రతీకాత్మక చిత్రం)

EPFO e-passbook | ఈపీఎఫ్ఓ కొత్త ఇ-పాస్‌బుక్ డౌన్‌లోడ్ సదుపాయం ప్రారంభమైంది. ఈపీఎఫ్ పాస్‌బుక్ పోర్టల్‌లో ఇ-పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేయొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులకు శుభవార్త. కొత్త ఇ-పాస్‌బుక్ వచ్చేసింది. కొద్ది రోజుల క్రితం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ మంత్రి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్మన్ భూపేందర్ యాదవ్ ఈపీఎఫ్ ఖాతాదారుల కోసం కొత్త ఇ-పాస్‌బుక్ (EPF e-passbook) సదుపాయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొత్త ఇ-పాస్‌బుక్ ఈపీఎఫ్ ఖాతాదారులకు డౌన్‌లోడ్‌కు అందుబాటులోకి వచ్చింది. గతంలోనే ఈపీఎఫ్ పోర్టల్‌లో పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. అయితే ఆ పాస్‌బుక్ టేబుల్ రూపంలో ఉండేది. ఇప్పుడు కొత్త ఇ-పాస్‌బుక్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉన్నాయి.

కొత్త ఈపీఎఫ్ పాస్‌బుక్‌లో వివరాలు గ్రాఫికల్‌గా ఉంటాయి. ఇప్పటివరకు జమ చేసిన మొత్తం, ఎంప్లాయీ షేర్, ఎంప్లాయర్ షేర్, వడ్డీ లాంటి వివరాలన్నీ గ్రాఫికల్‌గా కనిపిస్తాయి. రిటైర్మెంట్ తర్వాత వచ్చే మొత్తం ఎంత, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ ఎంత వర్తిస్తుంది, రిటైర్మెంట్ తర్వాత ఎంత పెన్షన్ వస్తుంది అన్న వివరాలు తెలుసుకోవచ్చు. మరి కొత్త ఇ-పాస్‌బుక్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

Important Dates: ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవే ముఖ్యమైన తేదీలు... గుర్తుంచుకోకపోతే చిక్కులే

ఈపీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేయండిలా

ముందుగా https://passbook.epfindia.gov.in/MemberPassBook/login పోర్టల్ ఓపెన్ చేయాలి.

మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.

లాగిన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో గ్రాఫికల్ ప్రజెంటేషన్‌లో వివరాలన్నీ కనిపిస్తే.

Member Wise Balance పైన క్లిక్ చేస్తే అందులో మీకు వేర్వేరు పీఎఫ్ అకౌంట్స్ ఉంటే ఏ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవచ్చు.

EPF Contribution Summary పైన క్లిక్ చేస్తే ఎంప్లాయీ షేర్, ఎంప్లాయర్ షేర్ ఎంతో తెలుస్తుంది.

Profile పైన క్లిక్ చేస్తే మీ వివరాలన్నీ ఉంటాయి.

Passbook పైన క్లిక్ చేస్తే మీరు ఏ సంవత్సరంలో ఎంత జమ చేశారో గ్రాఫికల్ ప్రజెంటేషన్ కనిపిస్తుంది. ఏ ఏడాదిలో ఏ నెలలో ఎంత జమ చేశారో కూడా తెలుసుకోవచ్చు.

పాస్‍‌బుక్‌ను పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.

Claims సెక్షన్‌లో మీరు గతంలో చేసిన క్లెయిమ్స్ వివరాలు తెలుస్తాయి.

Savings Scheme: సుకన్య సమృద్ధి, పీపీఎఫ్, ఇతర పథకాల్లో ఉన్నవారికి కొత్త రూల్

ఇదే పోర్టల్‌లో పలు క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. ఈపీఎఫ్ క్యాలిక్యులేటర్, ఈడీఎల్ఐ క్యాలిక్యులేటర్, పెన్షన్ క్యాలిక్యులేటర్‌లు ఉపయోగించే మీకు డబ్బులు ఎంత వస్తాయో తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ క్యాలిక్యులేటర్ ద్వారా మీ రిటైర్మెంట్ నాటికి ఎంత కార్పస్ జమ అవుతుందో తెలుస్తుంది. ఈడీఎల్ఐ క్యాలిక్యులేటర్‌లో మీకు ఇన్స్యూరెన్స్ ఎంత వర్తిస్తుందో తెలుస్తుంది. పెన్షన్ క్యాలిక్యులేటర్‌లో మీకు రిటైర్మెంట్ తర్వాత ఎంత పెన్షన్ వస్తుందో తెలుస్తుంది.

First published:

Tags: Epf, EPFO, Personal Finance

ఉత్తమ కథలు