హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF e-Nomination: మీ పీఎఫ్ అకౌంట్‌లో నామినీ పేరుందా? ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయండి ఇలా

EPF e-Nomination: మీ పీఎఫ్ అకౌంట్‌లో నామినీ పేరుందా? ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయండి ఇలా

EPF e-Nomination: మీ పీఎఫ్ అకౌంట్‌లో నామినీ పేరుందా? ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

EPF e-Nomination: మీ పీఎఫ్ అకౌంట్‌లో నామినీ పేరుందా? ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

EPF e-Nomination | పీఎఫ్ నామినేషన్ విధానాన్ని సులభతరం చేసింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO. కేవలం 15 నిమిషాల్లో ఆన్‌లైన్‌లో ఇ-నామినేషన్ పూర్తి చేయొచ్చు.

  మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉందా? ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరు నామినీ పేర్లను తప్పనిసరిగా అప్‌డేట్ చేయించాలి. పీఎఫ్ క్లెయిమ్ చేసుకోవాలంటే పీఎఫ్ నామినీ పేర్లు సరిగ్గా ఉండాలి. లేకపోతే క్లెయిమ్ సమయంలో చిక్కులు తప్పవు. ఇప్పటికే ఉన్న పేర్లను మార్చడం, నామినీగా కొత్త పేర్లను అప్‌డేట్ చేయడం, పెళ్లి తర్వాత భార్య లేదా భర్త పేరును నామినీగా వెల్లడించడం లాంటివన్నీ ఆన్‌లైన్‌లో చేయొచ్చు. పీఎఫ్ నామినేషన్ విధానాన్ని సులభతరం చేసింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO. కేవలం 15 నిమిషాల్లో ఆన్‌లైన్‌లో ఇ-నామినేషన్ పూర్తి చేయొచ్చు. మీ ఆధార్ నెంబర్, యూఏఎన్ ఐడీ, పాస్‌వర్డ్ ఉంటే చాలు. మీ మొబైల్ నెంబర్ ఆధార్‌కు లింకై ఉండాలి. ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ పోర్టల్‌లో ఇ-నామినేషన్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  EPF e-Nomination: ఈపీఎఫ్ ఇ-నామినేషన్ చేయండి ఇలా...


  ముందుగా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఓపెన్ చేయండి.

  మీ వివరాలతో లాగిన్ చేయండి. హోమ్ పేజీలో మీకు ఇ-నామినేషన్ లింక్ కనిపిస్తుంది.

  ఆ లింక్ క్లిక్ చేస్తే ఇ-నామినేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.

  టాప్‌లో 'Manage' క్లిక్ చేసి 'e-nomination' పైన క్లిక్ చేయండి.

  అక్కడ అడిగిన సమాచారాన్ని ఎంటర్ చేయండి.

  ఓసారి ప్రొఫైల్ సెక్షన్‌లో మీ ఫోటో, పర్మనెంట్, ప్రజెంట్ అడ్రస్, పెళ్లి లాంటి వివరాలను చెక్ చేసుకోండి.

  ఆ తర్వాత నామినీ వివరాలను ఎంటర్ చేయండి.

  నామినీ ఆధార్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, జెండర్, నామినీతో ఉన్న సంబంధం, అడ్రస్ వివరాలను వెల్లడించి నామినీ ఫోటోను అప్‌లోడ్ చేయండి. ఫోటో సైజ్ 3.5x4.5 సెంటీమీటర్లు ఉండాలి.

  ఓసారి వివరాలను సరిచూసుకొని అప్‌లోడ్ చేయాలి.

  డిజిటల్ సైన్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.


  Gold Toilet: బంగారంతో టాయిలెట్... ధర రూ.9 కోట్లు... చూస్తే షాకే
  ఇవి కూడా చదవండి:


  Pension Scheme: నెలకు రూ.5,000 పెన్షన్ కావాలా? ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి


  EPFO UAN: ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో యూఏఎన్ జనరేట్ చేయండి ఇలా


  Credit Card: మీ క్రెడిట్ కార్డుపై లిమిట్ తక్కువగా ఉంటే పెంచుకోండి ఇలా

  First published:

  Tags: EPFO, Personal Finance

  ఉత్తమ కథలు