New Rules: ఏప్రిల్ 1న అమల్లోకి రానున్న 11 కొత్త రూల్స్ ఇవే

New Rules: ఏప్రిల్ 1న అమల్లోకి రానున్న 11 కొత్త రూల్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

New Rules from April 1 | ఏప్రిల్ 1 వచ్చేస్తోంది. కొత్త నెలతో పాటు కొత్త రూల్స్ కూడా రాబోతున్నాయి. మీపై ప్రభావం చూపించే ఆ రూల్స్ గురించి తెలుసుకోండి.

 • Share this:
  ప్రతీ నెల మొదటి రోజు రాగానే జీతం చేతిలో పడటమే కాదు... కొత్త రూల్స్ కూడా అమల్లోకి వస్తాయి. ఏప్రిల్ 1 నుంచి కొన్ని కొత్త నియమనిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం కూడా మొదలవుతుంది. కాబట్టి ఈసారి చాలా మార్పులు ఉండబోతున్నాయి. అనేక అంశాల్లో ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఆదాయపు పన్ను విషయంలో మార్పులు ఉండబోతున్నాయి. ఇతర ఆర్థిక అంశాల్లో కూడా కొత్త రూల్స్ ఉంటాయి. మరి మీరు తెలుసుకోవాల్సిన, మీపై ప్రభావం చూపించే ఆ రూల్స్ ఏంటో తెలుసుకోండి.

  Bank Account: భారత ప్రభుత్వం 8 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని విలీనం చేసి 3 బ్యాంకులుగా మార్చిన సంగతి తెలిసిందే. దీంతో పాత బ్యాంకులకు చెందిన పాస్‌బుక్స్, చెక్ బుక్స్ ఏప్రిల్ 1 నుంచి పనిచేయవు. జయా బ్యాంక్, దేనా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎలాంటి మార్పులు ఉంటాయో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

  EPF: ప్రతీ ఏటా ఈపీఎఫ్ అకౌంట్‌లో రూ.2,50,000 పైనే జమ చేసేవారు వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ వడ్డీని కేంద్ర ప్రభుత్వం ఆదాయంగా పరిగణిస్తుంది. కాబట్టి ఇన్‍కమ్ ట్యాక్స్ శ్లాబ్స్ ప్రకారం పన్నులు చెల్లించాలి. ఈ రూల్ 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే ప్రతీ నెల రూ.2,00,000 కన్నా తక్కువ వేతనం పొందుతున్నవారికి ఈ మార్పు వల్ల వచ్చే నష్టమేమ లేదు.

  Bank Account: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? ఏప్రిల్ 1 నుంచి పాస్‌బుక్, చెక్ బుక్ పనిచేయవు

  Price Hike: ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు పెరుగుతాయి... కొనాలంటే ఇప్పుడే కొనండి

  ITR Forms: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం ఇకపై ప్రీ-ఫిల్డ్ ఫామ్స్ రానున్నాయి. దీని వల్ల పన్ను చెల్లింపుదారులు సులువుగా రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు.

  LTC Scheme: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో లీవ్ ట్రావెల్ కన్సెషన్-LTC వోచర్ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎల్‌టీసీ స్కీమ్‌లో ఇచ్చిన మినహాయింపులు మార్చి 31న ముగుస్తాయి. ఏప్రిల్ 1 నుంచి ఎలాంటి మినహాయింపులు ఉండవు.

  TDS: ఆదాయపు పన్ను చట్టంలో కొత్తగా 206ఏబీ సెక్షన్ చేర్చింది ఆదాయపు పన్ను శాఖ. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయనివారు టీడీఎస్‌పై ఎక్కువ రేట్ వసూలు చేసే నిబంధన ఇది.

  Tax Filing: ఏప్రిల్ 1 తర్వాత 75 ఏళ్ల పైన ఉన్నవారు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. పెన్షన్ ద్వారా, ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నవారికి ఇది వర్తిస్తుంది. వారికి పన్నులను బ్యాంకులనే నేరుగా డిడక్ట్ చేస్తుంది ప్రభుత్వం.

  Salary: కొత్త వేతన కోడ్ ఏప్రిల్ 1న అమల్లోకి రానుంది. కొత్త నిబంధనల ప్రకారం అలవెన్సులు 50 శాతం మించి ఉండకూడదు. ప్రస్తుతం బేసిక్ వేతనం 35 నుంచి 45 శాతం నుంచే ఉంటుంది. దీంతో బేసిక్ పే పెంచాల్సిన అవసరం ఉంది. బేసిక్ పే పెరిగితే అందులో 12 శాతం పీఎఫ్‌ అకౌంట్‌లో జమ చేయాలి. కాబట్టి పీఎఫ్‌లో జమ చేసే మొత్తం కూడా పెరుగుతుంది. మొత్తంగా ఉద్యోగుల టేక్ హోమ్ సాలరీ తగ్గుతుంది.

  Smartphone under Rs 10000: కొత్త ఫోన్ కొనాలా? రూ.10,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే

  Vi New Plans: వొడాఫోన్ ఐడియా నుంచి సరికొత్త ప్లాన్స్... డిస్నీ+ హాట్‌స్టార్ యాక్సెస్ ఉచితం

  Gratuity: ఒక కంపెనీలో ఐదేళ్లు వరుసగా సేవలు అందించిన ఉద్యోగులకు గ్రాట్యుటీ లభిస్తుంది. గ్రాట్యుటీకి సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇకపై ఒక ఏడాది పనిచేసినా గ్రాట్యుటీ ఇవ్వాలి.

  Term Insurance Plan: ఏప్రిల్ 1 నుంచి టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం రేట్స్ పెరగనున్నాయి. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా డెత్ క్లెయిమ్స్ పెరిగాయి. దీంతో ప్రీమియం రేట్స్ పెంచాలని ఇన్స్యూరెన్స్ కంపెనీలు నిర్ణయించాయి. ప్రైవేట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ప్రీమియం పెంచుతున్ాయి కానీ ఎల్ఐసీలో ఎలాంటి పెంపు లేదు.

  All India Tourist Permit: టూరిజంను ప్రమోట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్‌ను అందిస్తోంది. టూర్ ఆపరేటర్స్ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన 30 రోజుల్లో పర్మిట్ లభస్తుంది. ఈ కొత్త రూల్స్ 2021 ఏప్రిల్ 1న అమల్లోకి వస్తాయి.

  Price Hike: ఏప్రిల్ 1న టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీల ధరలు పెరగనున్నాయి. విడిభాగాల కొరతతో పాటు ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ పెంచడం లాంటి కారణాలతో వీటి ధరలు పెరగనున్నాయి. వీటితో పాటు ఎల్ఈడీ లైట్స్, మొబైల్ ఫోన్లు, సోలార్ ఇన్వర్టర్లు, లాంతర్లు, ఆటో మొబైల్ పార్ట్స్, స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ కాంపోనెంట్స్, లిథియం ఇయాన్ బ్యాటరీ రా మెటిరీయల్స్, ఇంక్ క్యాట్రిడ్జెస్, లెదర్ ప్రొడక్ట్స్ నైలాన్ ఫైబర్, ప్లాస్టిక్ బిల్డర్ వేర్స్, పాలిష్డ్ సింథటిక్ స్టోన్స్, పాలిష్డ్ క్యూబిక్ జిర్కోనియా లాంటి ధరలు పెరుగుతాయి.
  Published by:Santhosh Kumar S
  First published: