ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ద్వారా లక్షాధికారులు కావొచ్చని తెలుసు. కానీ ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేయడం ద్వారా కోటీశ్వరులు కూడా కావొచ్చు. ఈపీఎఫ్ అకౌంట్లో జమ చేసే డబ్బులకు వడ్డీ బాగా వస్తుంది. బయట బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లతో పోలిస్తే ఈపీఎఫ్ వడ్డీ రేట్లే ఎక్కువ. ప్రస్తుతం 8.5 శాతం వడ్డీ లభిస్తోంది. ఇదే స్థాయిలో వడ్డీ వస్తే ఈపీఎఫ్ అకౌంట్ లక్షలు కాదు కోట్లు కూడబెట్టొచ్చని పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ లెక్కలు చెబుతున్నారు. అయితే ఈపీఎఫ్ అకౌంట్ ద్వారా కోటీశ్వరులు కావాలంటే తక్కువ వయస్సు నుంచే ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తూ ఉండాలి. మధ్యలో విత్డ్రా చేయకూడదు. బేసిక్ సాలరీ కూడా ఎక్కువే ఉండాలి. ఇవన్నీ సరిగ్గా ఉన్నట్టైతే రిటైర్మెంట్ నాటికి ఈపీఎఫ్ అకౌంట్లో కోటి రూపాయల పైనే ఉంటాయని సీఎన్బీసీ టీవీ18 ఓ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్... ఈపీఎఫ్ఓ తీసుకున్న 5 కీలక నిర్ణయాలు ఇవే
EPF Withdrawal: ఈపీఎఫ్ ఖాతాలో రెండోసారి కోవిడ్ అడ్వాన్స్ తీసుకోండి ఇలా
ఉద్యోగి బేసిక్ వేతనంలో 12 శాతం యాజమాన్యం వాటా, 12 శాతం ఉద్యోగి వాటా ఈపీఎఫ్ అకౌంట్లో ప్రతీ నెల జమ అవుతుందన్న సంగతి తెలిసిందే. ఇలా ప్రతీ నెల జమ చేస్తూ ఉంటే కోటి రూపాయల పైనే కూడగట్టొచ్చని తత్వం అండ్ కో స్ట్రెసెస్ ఫౌండర్ పార్ట్నర్ పీతమ్ గోయల్ సీఎన్బీసీ టీవీ18 కు వివరించారు. 21 ఏళ్ల వ్యక్తి రూ.2,10,000 ప్యాకేజీతో జీవితం మొదలుపెట్టాడనుకుందాం. వార్షిక ఇంక్రిమెంట్ 8 శాతం చొప్పున ఉంటే రిటైర్మెంట్ నాటికి రూ.2 కోట్లు జమ అవుతాయి. రిటైర్మెంట్ వరకు మధ్యలో ఎప్పుడూ డబ్బులు డ్రా చేయకపోతే రూ.2.42 కోట్ల వరకు జమ చేయొచ్చని ఈజీపే ఫౌండర్ అండ్ సీఈఓ, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ షామ్స్ తబ్రేజ్ తెలిపారు. రూ.25,000 బేసిక్ వేతనం ఉన్న వ్యక్తి 35 ఏళ్లలో రూ.1.65 కోట్లు కూడబెట్టొచ్చని తెలిపారు. అందుకే ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బులను డ్రా చేయకూడదని అంటుంటారు పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు. మరి ఇప్పటివరకు మీ ఈపీఎఫ్ అకౌంట్లో ఎంత జమైందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
EPF Withdrawal: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త... ఒక్క రోజులో రూ.1,00,000 విత్డ్రా చేయొచ్చు ఇలా
EPFO Insurance: ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు రూ.7,00,000 వరకు బీమా
ఎప్పుడైనా పెద్దమొత్తంలో డబ్బులు కావాల్సినప్పుడు ఈపీఎఫ్ ఖాతా నుంచి విత్డ్రా చేయడం చాలామందికి అలవాటే. వైద్య ఖర్చుల కోసం, పిల్లల పైచదువుల కోసం, పెళ్లిళ్ల కోసం, ఇంటి నిర్మాణం కోసం పీఎఫ్ అకౌంట్ నుంచి పాక్షికంగా విత్డ్రా చేసే అవకాశం ఇస్తోంది ఈపీఎఫ్ఓ. మరీ అత్యవసరమైతే తప్ప పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయకపోవడమే మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO, Personal Finance, Save Money