హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPFO: మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? ఉమాంగ్ యాప్‌లో తెలుసుకోండి ఇలా

EPFO: మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? ఉమాంగ్ యాప్‌లో తెలుసుకోండి ఇలా

EPFO: మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? ఉమాంగ్ యాప్‌లో తెలుసుకోండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

EPFO: మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? ఉమాంగ్ యాప్‌లో తెలుసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

EPF balance check | మీరు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఉమాంగ్ యాప్‌లో సులువుగా తెలుసుకోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి.

  భారత ప్రభుత్వం రూపొందించిన యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్-UMANG యాప్ ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్లను ఆకట్టుకుంటోంది. ఈపీఎఫ్ సేవల్ని ఉమాంగ్ యాప్‌లో సులువుగా పొందుతున్నారు సబ్‌స్క్రైబర్లు. ఎక్కువగా ఈపీఎఫ్ మెంబర్ పాస్‌బుక్ కోసం ఉమాంగ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారని తేలింది. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఉమాంగ్ యాప్‌ను 90 శాతం ఈపీఎఫ్ సేవల కోసమే ఉపయోగించినట్టు తేలింది. దీన్ని బట్టి ఈ యాప్ ఎంత పాపులర్ అవుతుందో అర్థం చేసుకవోచ్చు. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఈపీఎఫ్ఓ పాండమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీ ద్వారా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, మెంబర్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ కోసం ఉమాంగ్ యాప్‌ను ఎక్కువగా ఉపయోగించారు. ఈపీఎఫ్ బ్యాలెన్స్, మెంబర్ పాస్‌బుక్ మాత్రమే కాదు... ఉమాంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ఓకు సంబంధించిన 16 వేర్వేరు సేవల్ని సబ్‌స్క్రైబర్లు పొందొచ్చు. క్లెయిమ్ దరఖాస్తు, క్లెయిమ్ ట్రాక్ చేయడం, క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవడం లాంటి సేవలన్నీ లభిస్తాయి. ఈ సేవలన్నీ పొందడానికి యాక్టీవ్‌లో ఉన్న యూఏఎన్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరి.

  Loan: మీరు చిరు వ్యాపారులా? మోదీ ప్రభుత్వం లోన్ ఇస్తున్న లోన్‌కు అప్లై చేయండిలా

  Personal Loan: క్రెడిట్ స్కోర్ తక్కువున్నా... లోన్ తీసుకోవచ్చు ఇలా

  EPF balance check, EPF balance check UMANG App, EPF member passbook, UMANG App EPF balance, EPF claim applications, EPF withdrawal, ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్, ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్ మెంబర్ పాస్‌బుక్, ఉమాంగ్ యాప్ ఈపీఎఫ్ బ్యాలెన్స్, ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్, ఈపీఎఫ్ విత్‌డ్రాయల్
  ప్రతీకాత్మక చిత్రం

  2020 ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉమాంగ్ యాప్ ద్వారానే 11.27 లక్షల క్లెయిమ్ దరఖాస్తులు వచ్చాయి. 2019 డిసెంబర్ నుంచి 2020 మార్చి మధ్య ఉమాంగ్ యాప్ ద్వారా 3.97 లక్షల క్లెయిమ్ దరఖాస్తులు వచ్చాయి. అంటే కరోనా వైరస్ సంక్షోభం సమయంలో సుమారు మూడు రెట్లు ఎక్కువగా ఉమాంగ్ యాప్‌ను ఈపీఎఫ్ సేవల కోసం ఉపయోగించారు. ఇక 2019 డిసెంబర్ నుంచి 2020 మార్చి మధ్య ఉమాంగ్ యాప్‌లో మెంబర్ పాస్‌బుక్‌ను 27.55 కోట్ల సార్లు చూస్తే, కరోనా సంక్షోభ కాలంలో 244.77 కోట్ల సార్లు చూశారు. అంటే ఈపీఎప్ సబ్‌స్క్రైబర్లు ఈపీఎఫ్ఓ సేవల కోసం ఎక్కువగా ఉమాంగ్ యాప్‌పైన ఆధారపడుతున్నారని అర్థమవుతోంది.

  LIC: ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు గుడ్ న్యూస్... ఈ అవకాశం 2 నెలలు మాత్రమే

  Cheque Payment: ఎవరికైనా చెక్ ఇస్తున్నారా? ఆర్‌బీఐ కొత్త రూల్‌తో మీరు సేఫ్

  EPF balance check, EPF balance check UMANG App, EPF member passbook, UMANG App EPF balance, EPF claim applications, EPF withdrawal, ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్, ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్ మెంబర్ పాస్‌బుక్, ఉమాంగ్ యాప్ ఈపీఎఫ్ బ్యాలెన్స్, ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్, ఈపీఎఫ్ విత్‌డ్రాయల్
  ప్రతీకాత్మక చిత్రం

  ఉమాంగ్ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో సులువుగా ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో ఈపీఎఫ్ సేవల కోసం ఈ యాప్‌పై ఆసక్తి చూపిస్తున్నారు సబ్‌స్క్రైబర్లు. మీరు కూడా ఉమాంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్ సేవలు పొందాలనుకుంటే ముందుగా ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈపీఎఫ్ఓ పైన క్లిక్ చేయాలి. అందులో ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత వ్యూ పాస్‌బుక్ పైన క్లిక్ చేయాలి. మీ యూఏఎన్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఆ తర్వాత మెంబర్ ఐడీ పైన క్లిక్ చేస్తే స్క్రీన్ పైన పాస్‌బుక్ కనిపిస్తుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Business, BUSINESS NEWS, EPFO, Personal Finance

  ఉత్తమ కథలు