హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF Account Transfer: మీ ఈపీఎఫ్ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా

EPF Account Transfer: మీ ఈపీఎఫ్ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా

EPF Account Transfer: మీ ఈపీఎఫ్ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

EPF Account Transfer: మీ ఈపీఎఫ్ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

EPF Account Transfer Online | టెక్నాలజీని ఉపయోగించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO అనేక సేవల్ని ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. దీని వల్ల ఈపీఎఫ్ చందాదారులు ఆన్‌లైన్‌లోనే అనేక సేవల్ని పొందొచ్చు.

మీరు మీ పాత ఈపీఎఫ్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారా? ఇందుకోసం మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో సులువుగా ప్రాసెస్ చేయొచ్చు. ఆన్‌లైన్ ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ ద్వారా మీ ఇంట్లో కూర్చొని మీ పాత ఈపీఎఫ్ అకౌంట్‌ను కొత్త అకౌంట్‌కు సులువుగా మార్చుకోవచ్చు. కేవలం ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేస్తే చాలు. మీరు అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్‌ని ఆన్‌లైన్‌లోనే పరిశీలించి మీ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తుంది ఈపీఎఫ్ఓ. మీరు మీ పాత ఈపీఎఫ్ అకౌంట్‌ని ట్రాన్స్‌ఫర్ చేయాలంటే పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ ఫామ్, ఫామ్ 13 లాంటివి సబ్మిట్ చేయడంతో పాటు మీకు తగిన అర్హతలు ఉండాలి. మరి మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏవో, ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో, ఏఏ స్టెప్స్ ఫాలో అవాలో తెలుసుకోండి.

Flash Sale: ఫ్లాష్ సేల్‌లో స్మార్ట్ టీవీ, స్మార్ట్‌ఫోన్ ఒక్క రూపాయికే

iPhone: మీ పాత ఫోన్ ఇచ్చేసి రూ.10 వేలకే ఐఫోన్ కొనండి ఇలా

మీరు మీ ఈపీఎఫ్ అకౌంట్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడానికి కొన్ని డాక్యుమెంట్స్ అవసరం. మీ యూఏఎన్ నెంబర్ ఉండాలి. ప్రస్తుతం పనిచేస్తున్న యాజమాన్యానికి సంబంధించిన వివరాలు ఉండాలి. అకౌంట్ నెంబర్, ఎస్టాబ్లిష్‌మెంట్ నెంబర్, మీ పాత ఈపీఎఫ్ అకౌంట్, కొత్త ఈపీఎఫ్ అకౌంట్, సాలరీ అకౌంట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఫామ్ 13 లాంటి వివరాలు తప్పనిసరి. ఇక వీటితో పాటు యూఏఎన్ నెంబర్ యాక్టీవ్‌గా ఉండాలి. మీ సాలరీ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉండాలి. అప్పుడే మీ ఎంప్లాయర్ సులువుగా మీ ఈపీఎఫ్ అకౌంట్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడం కుదురుతుంది. మీ యూఏఎన్‌కు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా లింకై ఉండాలి. మీ మెంబర్ ఐడీకి ఒకే ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ పెట్టడం సాధ్యమవుతుంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి ప్రాసెస్ మొదలుపెట్టొచ్చు.

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే లాభం

SBI Debit Card: షాపింగ్‌కు డబ్బులు లేవా? రూ.1,00,000 వరకు ఇస్తున్న ఎస్‌బీఐ

ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. మీ యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. ఆ తర్వాత Online Services పైన క్లిక్ చేయాలి. అందులో Transfer Request ఆప్షన్ ఎంచుకోవాలి. పాత ఈపీఎఫ్ అకౌంట్ మెంబర్ ఐడీ సబ్మిట్ చేయాలి. మీ యూఏఎన్, మెంబర్ ఐడీ ఎంటర్ చేయాలి. Get OTP పైన క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత 10 రోజుల్లో ఆన్‌లైన్ పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్‌ను పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీ ప్రస్తుత ఎంప్లాయర్‌కు ఇవ్వాలి. ప్రస్తుత ఎంప్లాయర్ అప్రూవ్ చేయగానే మీ పాత పీఎఫ్ అకౌంట్ సక్సెస్‌ఫుల్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ట్రాకింగ్ ఐడీ కూడా వస్తుంది. ఆ ఐడీతో Online Services సెక్షన్‌లో Track Claim Status ఆప్షన్ సెలెక్ట్ చేసి స్టేటస్ ట్రాక్ చేయొచ్చు.

First published:

Tags: EPFO, Personal Finance

ఉత్తమ కథలు