Home /News /business /

EPF ACCOUNT NAME CORRECTION KNOW HOW EPF ACCOUNT HOLDERS CAN UPDATE THEIR NAME DATE OF BIRTH AND CONTACT DETAILS ON EPFO PORTAL SS

EPF Account: పీఎఫ్ అకౌంట్‌లో పేరు తప్పుగా ఉందా? సింపుల్‌గా ఇలా సరిచేయండి

EPF Account: పీఎఫ్ అకౌంట్‌లో పేరు తప్పుగా ఉందా? సింపుల్‌గా ఇలా సరిచేయండి
(ప్రతీకాత్మక చిత్రం)

EPF Account: పీఎఫ్ అకౌంట్‌లో పేరు తప్పుగా ఉందా? సింపుల్‌గా ఇలా సరిచేయండి (ప్రతీకాత్మక చిత్రం)

EPF Name Correction | మీ ఈపీఎఫ్ అకౌంట్‌లో (EPF Account) పేరు తప్పుగా ఉందా? పుట్టిన తేదీ సరిగ్గా లేదా? ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఆన్‌లైన్‌లో పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ డీటెయిల్స్ ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి.

    ఇటీవల కాలంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సేవల్ని ఉపయోగించేవారి సంఖ్య పెరిగిపోయింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉద్యోగులు తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (EPF Account) నుంచి డబ్బులు విత్‌డ్రా చేసే వెసులుబాటు కల్పించింది ఈపీఎఫ్ఓ. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్ (PF Account) నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారు. అయితే పీఎఫ్ అకౌంట్‌లో వివరాలు సరిగ్గా లేకపోవడం వల్ల క్లెయిమ్ సెటిల్మెంట్ పెండింగ్‌లో ఉంటోంది. మరోవైపు ఈపీఎఫ్ఓ ఇ-నామినేషన్ తప్పనిసరిగా ఫైల్ చేయమని కోరుతోంది. పీఎఫ్ అకౌంట్‌లో వివరాలు తప్పుగా ఉండటం వల్ల ఇ-నామినేషన్ ఫైలింగ్ కూడా సాధ్యం కావట్లేదు.

    మరి మీ ఈపీఎప్ అకౌంట్‌లో పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలు తప్పుగా ఉన్నాయా? ఈ వివరాలు తప్పుగా ఉన్నందుకు మీరు ఈపీఎఫ్ఓ సేవల్ని వినియోగించలేకపోతున్నారా? ఈపీఎఫ్ ఖాతాదారులు తమ వివరాలను ఆన్‌లైన్‌లోనే సరిచేసుకునే అవకాశం కల్పిస్తోంది ఈపీఎఫ్ఓ. మెంబర్ యూనిఫైడ్ పోర్టల్‌లో లాగిన్ అయి వివరాలు సరిచేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

    SBI 3-in-1 Account: ఎస్‌బీఐలో త్రీ ఇన్ వన్ అకౌంట్ తీసుకుంటే బెనిఫిట్స్ ఇవే

    EPF Account: ఈపీఎఫ్ అకౌంట్‌లో పేరు, పుట్టినతేదీ సరిచేయండి ఇలా


    Step 1- ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లు ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ మెంబర్ యూనిఫైడ్ పోర్టల్ ఓపెన్ చేయాలి.

    Step 2- తమ యూఏఎన్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కావాలి.

    Step 3- లాగిన్ అయిన తర్వాత Manage సెక్షన్‌లోకి వెళ్లాలి.

    Step 4- ఆ తర్వాత Basic Details పైన క్లిక్ చేయాలి.

    Step 5- ఆధార్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలన్నీ ఎంటర్ చేయాలి.

    Step 6- Update Details పైన క్లిక్ చేయాలి.

    Step 7- మీ పేరు మార్పు కోసం చేసిన రిక్వెస్ట్ మీ ఎంప్లాయర్ దగ్గరకు వెళ్తుంది.

    Credit Cards: క్రెడిట్ కార్డుకు అప్లై చేస్తున్నారా? క్యాష్‌బ్యాక్ ఇచ్చే కార్డులు ఇవే

    మీరు చేసిన రిక్వెస్ట్‌ను ఎంప్లాయర్ పరిశీలిస్తారు. వివరాలన్నీ చెక్ చేసిన తర్వాత మీ రిక్వెస్ట్‌ను అప్రూవ్ చేస్తారు. ఈపీఎఫ్ అకౌంట్‌లో పేరు, పుట్టిన తేదీ మార్చడానికి బర్త్ సర్టిఫికెట్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ రికార్డ్స్‌కు సంబంధించిన సర్టిఫికెట్, పాస్‌పోర్ట్, ప్రభుత్వ శాఖలకు చెందిన ఏదైనా డాక్యుమెంట్, సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, ఇ-ఆధార్ లాంటి డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది.

    EPF Account: ఈపీఎఫ్ అకౌంట్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ సరిచేయండి ఇలా


    Step 1- ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లు మెంబర్ యూనిఫైడ్ పోర్టల్‌లో లాగిన్ కావాలి.

    Step 2- ఆ తర్వాత Manage సెక్షన్‌లో Contact Details పైన క్లిక్ చేయాలి.

    Step 3- మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ అప్‌డేట్ చేయాలి.

    Step 4- Update Details పైన క్లిక్ చేయాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: EPFO, Personal Finance, PF account

    తదుపరి వార్తలు