హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF ఖాతాదారులు పదవీ విరమణ తర్వాత రూ. 50,000 లాయల్టీ బోనస్ పొందే అవకాశం, పూర్తి వివరాలు తెలుసుకోండి

EPF ఖాతాదారులు పదవీ విరమణ తర్వాత రూ. 50,000 లాయల్టీ బోనస్ పొందే అవకాశం, పూర్తి వివరాలు తెలుసుకోండి

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

EPF ఖాతాదారులకు పదవీ విరమణ తర్వాత రూ. 50,000 అదనపు బోనస్ లభిస్తుంది, అయితే దాన్ని పొందడానికి కొన్ని షరతులు పాటించాలి. ప్రతి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులు తెలుసుకోవడం ముఖ్యం. ఈ అదనపు బోనస్ పొందడానికి నియమాల గురించి తెలుసుకోండి.

EPF ఖాతా ఉన్న వ్యక్తులకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అనేక రకాల ప్రయోజనాలను అందజేస్తుంది. EPFపై వడ్డీ, పెన్షన్ , భీమా EPF ఖాతాదారులకు తెలుసు కానీ EPF ఖాతాదారులకు పదవీ విరమణ తర్వాత అదనపు బోనస్ కూడా లభిస్తుందని చాలా మంది ఖాతాదారులకు తెలియదు. EPF ఖాతాదారులకు పదవీ విరమణ తర్వాత రూ. 50,000 అదనపు బోనస్ లభిస్తుంది, అయితే దాన్ని పొందడానికి కొన్ని షరతులు పాటించాలి. ప్రతి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులు తెలుసుకోవడం ముఖ్యం. ఈ అదనపు బోనస్ పొందడానికి నియమాల గురించి తెలుసుకోండి.

అదనపు బోనస్ పొందాలంటే ఏం చేయాలి..

20 ఏళ్లపాటు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాలో డబ్బును డిపాజిట్ చేయడం తప్పనిసరి. ఇలా చేయడం ద్వారా, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన ఖాతాదారులకు లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ కింద అదనపు బోనస్‌ను అందిస్తుంది. 20 ఏళ్లుగా పీఎఫ్ ఖాతాలో డబ్బు డిపాజిట్ చేసిన ఖాతాదారులకు మాత్రమే ఈ ప్రయోజనం లభిస్తుంది.

అదనపు బోనస్ ఎలా నిర్ణయిస్తారు...

EPF ఖాతాదారులకు ప్రాథమిక వేతనం ఆధారంగా అదనపు బోనస్ నిర్ణయించబడుతుంది. ప్రాథమిక వేతనం రూ.5,000 ఉన్న పీఎఫ్ ఖాతాదారులకు రూ.30,000 అదనపు బోనస్‌గా ఇవ్వబడుతుంది. 5,000 నుండి 10,000 మధ్య బేసిక్ జీతం ఉన్నవారికి రూ.40,000 అదనపు బోనస్ ఇవ్వబడుతుంది. రూ.10,000 కంటే ఎక్కువ ప్రాథమిక వేతనం ఉన్న ఉద్యోగులకు రూ.50,000 అదనపు బోనస్ ఇస్తారు.

20 సంవత్సరాల నియమం నుండి ఏ ఖాతాదారులకు మినహాయింపు ఉంది?

20 ఏళ్లు పూర్తి కాకుండానే వికలాంగులుగా మారిన ఉద్యోగులకు 20 ఏళ్ల షరతు నుంచి మినహాయింపు ఉంటుంది. అటువంటి ఉద్యోగుల పదవీ విరమణపై అదనపు బోనస్ ఇవ్వబడుతుంది. అయితే, అటువంటి వారికి వారి ప్రాథమిక వేతనం ఆధారంగా అదనపు బోనస్ ఇవ్వబడుతుంది.

కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా 2021-22 ఆర్ధిక సంవత్సరానికి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని ఈపీఎఫ్ఓ(EPFO)​​నిర్ణయించింది. ఇక్కడ విరాళాల కంటే ఎక్కువ ఉపసంహరణలు జరిగాయి. కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసినప్పుడు 2020-21 ఆర్ధిక సంవత్సరంలో వడ్డీ రేటు ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇక ఇప్పుడు రిటైర్‌మెంట్ బాడీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు వడ్డీ రేటుతో వడ్డీని ఖాతాలకు జమ చేయడంతో, చాలా మంది ఆ మొత్తాన్ని అందుకున్నట్లు ధృవీకరించారు. అయితే, వారు ఖాతా బ్యాలెన్స్‌ను ఎలా తనిఖీ చేశారో తెలుసుకుందాం. మీరు వివిధ పద్ధతులను ఉపయోగించి డిజిటల్‌గా ఎప్పుడైనా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయవచ్చు. ఉమంగ్ యాప్, EPFO వెబ్ సైట్, ఇ-సేవా వెబ్‌సైట్, SMS లేదా మిస్డ్ కాల్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకునే అవకాశం ఉంది.

First published:

Tags: EPFO

ఉత్తమ కథలు