మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ప్రతీ నెలా మీ జీతంలోంచి ఈపీఎఫ్ అకౌంట్‌లోకి డబ్బులు జమ అవుతున్నాయా? ప్రతీ నెల జమ అయ్యే డబ్బుల వివరాలు మీ మొబైల్‌కు ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్‌లో రావట్లేదా? అయితే మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ సరిగ్గా లేకపోవచ్చు. మీరు మీ ఈపీఎఫ్ అకౌంట్‌కి పాత మొబైల్, పాత ఇమెయిల్ ఐడీ ఇచ్చారేమో ఓసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ఈపీఎఫ్ అకౌంట్‌లో పాత మొబైల్ నెంబర్, పాత ఇమెయిల్ ఐడీ ఉంటే మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ అప్‌డేట్ చేయొచ్చు. ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌లో చాలా ఈజీగా మార్చొచ్చు. మరి మీ ఈపీఎఫ్ అకౌంట్‌లో మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి.
ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పోర్టల్ ఓపెన్ చేయండి.
ఆ తర్వాత మీ వివరాలతో లాగిన్ అవండి.
ఆ తర్వాత manage సెక్షన్ పైన క్లిక్ చేయండి.
అందులో contact details పైన క్లిక్ చేయండి.
పాత మొబైల్ నెంబర్ ఉంటే change mobile number పైన క్లిక్ చేయాలి.
మీ కొత్త మొబైల్ నెంబర్‌ను రెండు సార్లు ఎంటర్ చేయాలి.
Get Authorization Pin పైన క్లిక్ చేయాలి.
మీ కొత్త మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
ఈపీఎఎఫ్ అకౌంట్‌లో కొత్త మొబైల్ నెంబర్ అప్‌డేట్ అవుతుంది.
ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పోర్టల్ ఓపెన్ చేయండి.
ఆ తర్వాత మీ వివరాలతో లాగిన్ అవండి.
ఆ తర్వాత manage సెక్షన్ పైన క్లిక్ చేయండి.
అందులో contact details పైన క్లిక్ చేయండి.
పాత ఇమెయిల్ ఐడీ ఉంటే Change E-Mail Id పైన క్లిక్ చేయండి.
మీ కొత్త ఇమెయిల్ ఐడీని రెండు సార్లు ఎంటర్ చేయాలి.
Get Authorization Pin పైన క్లిక్ చేయాలి.
మీ కొత్త ఇమెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
ఈపీఎఎఫ్ అకౌంట్‌లో కొత్త ఇమెయిల్ అప్‌డేట్ అవుతుంది.
ఇక ఇప్పటికే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ఈపీఎఫ్ అకౌంట్‌లో 8.5 శాతం వడ్డీ జమ చేస్తోంది. మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ అప్‌డేట్ చేస్తే వడ్డీ జమ కాగానే మీకు వివరాలు వెంటనే తెలుస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.