ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ఇటీవల 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలు ఈపీఎఫ్ ఖాతాదారులను ప్రభావితం చేసేవే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అందుకే వారికి మేలు చేసేందుకు ఈపీఎఫ్ఓ పలు నిర్ణయాలు తీసుకుంది. దీంతో పాటు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ తీసుకున్న నిర్ణయాల్లో సెకండ్ కోవిడ్ అడ్వాన్స్, నాన్ రీఫండబుల్ అడ్వాన్స్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్-EDLI లాంటి అంశాలకు సంబంధించినవి ఉన్నాయి. మరి ఈపీఎఫ్ఓ తీసుకున్న 5 కీలక నిర్ణయాల గురించి తెలుసుకోండి.
EPF Aadhaar Seeding: ఈపీఎఫ్ ఖాతాదారులు తమ ఆధార్ నెంబర్‌ను తప్పనిసరిగా ఈపీఎఫ్ అకౌంట్‌తో లింక్ చేయాలి. లేకపోతే యాజమాన్యం వాటా ఈపీఎఫ్ ఖాతాలో జమ కాదు. ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి 2021 మే 31న గడువు ముగిసింది. అయితే ఉద్యోగులకు మరో అవకాశం ఇస్తూ గడువును 2021 సెప్టెంబర్ 1 వరకు పొడిగించింది ఈపీఎఫ్ఓ.
EPF Account: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త... అకౌంట్లోకి వడ్డీ జమ చేసేది ఎప్పుడంటే
EPF Withdrawal: ఈపీఎఫ్ ఖాతాదారులు కరోనాతో చనిపోతే క్లెయిమ్ కోసం దరఖాస్తు విధానం ఇదే
Second Covid advance: గతేడాది కరోనా వైరస్ మహమ్మారి విజృంభించడంతో కోవిడ్ 19 ప్యాండమిక్ అడ్వాన్స్ సదుపాయాన్ని కల్పించింది ఈపీఎఫ్ఓ. అప్పుడు కోవిడ్ అడ్వాన్స్ తీసుకున్నవారు రెండోసారి కూడా అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఇచ్చింది ఈపీఎఫ్ఓ. ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం లేదా మూడు నెలల బేసిక్ వేతనం + డీఏ తీసుకోవచ్చు. మరి అడ్వాన్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Non Refundable advance: గత నెలరోజులు లేదా అంతకన్నా ఎక్కువ కాలంగా ఉద్యోగం లేనివాళ్లు కూడా తమ పీఎఫ్ బ్యాలెన్స్ నుంచి 75 శాతం అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్ క్లోజ్ చేయకుండా పీఎఫ్ బ్యాలెన్స్‌లో కొంత మొత్తం తీసుకునే వెసులుబాటు కల్పించింది ఈపీఎఫ్ఓ.
Pension Scheme: నెలకు రూ.3,000 పెన్షన్ వచ్చే ఈ స్కీమ్‌లో చేరండి ఇలా
Credit Card: ఈ క్రెడిట్ కార్డుతో 71 లీటర్ల పెట్రోల్ ఫ్రీ... ఆఫర్ వివరాలు ఇవే
Medical advance: ఈపీఎఫ్ ఖాతాదారులు రూ.1,00,000 వరకు మెడికల్ అడ్వాన్స్ తీసుకోవచ్చని ప్రకటించింది ఈపీఎఫ్ఓ. కరోనాతో పాటు ఇతర వ్యాధులతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు రూ.1,00,000 మెడికల్ అడ్వాన్స్ పొందొచ్చు. అయితే ఆ పేషెంట్ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో ఉన్న ఆస్పత్రిలో చేరితేనే ఇది వర్తిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
EDLI Scheme: ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్-EDLI ద్వారా ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు గతంలో రూ.6,00,000 బీమా సౌకర్యం ఉండేది. బీమాను మరో రూ.1,00,000 పెంచింది ఈపీఎఫ్ఓ. కాబట్టి ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈ స్కీమ్ ద్వారా రూ.7,00,000 వరకు ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. మరిన్ని వివరాలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid-19, EPFO, Insurance, Personal Finance