Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Rules: డిసెంబర్‌లో గుర్తుంచుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే

New Rules: డిసెంబర్‌లో గుర్తుంచుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే

New Rules: ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు, పెట్టుబడి పథకాల్లో కొత్త రూల్స్.. మీకు తెలుసా..

New Rules: ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు, పెట్టుబడి పథకాల్లో కొత్త రూల్స్.. మీకు తెలుసా..

New Rules in December| డిసెంబర్‌లో కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. కొన్ని మార్పులు కూడా ఉండబోతున్నాయి. ఈ కొత్త రూల్స్ (New Rules) మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.

డిసెంబర్ వచ్చేస్తోంది. కొత్త నెల వచ్చిన ప్రతీ సారీ కొత్త రూల్స్ కూడా వస్తుంటాయి. డిసెంబర్‌లో అందరూ గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నియమనిబంధనలు ఉన్నాయి. పలు అంశాలపై డిసెంబర్‌లో కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర (LPG Gas Cylinder Price), ఈపీఎఫ్ అకౌంట్ ఆధార్ నెంబర్ లింకింగ్ (EPF Aadhaar Linking), ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (IT Returns)... ఇలా అనేక అంశాలకు సంబంధించి కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. డిసెంబర్‌లో అమలులోకి రాబోయే కొత్త రూల్స్ ఏం ఉన్నాయో తెలుసుకోండి.

EPF Aadhaar Linking: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ ఉన్నవారంతా తప్పనిసరిగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌కు (UAN) ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాలి. గతంలో 2021 సెప్టెంబర్ 1 లోగా ఉన్న గడువును 2021 నవంబర్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అప్పట్లోగా యూఏఎన్‌ను ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాల్సిందే. లేకపోతే ఈపీఎఫ్ అకౌంట్‌లో యజమాని వాటా జమ కాదు. యూఏఎన్‌తో ఆధార్ నెంబర్ ఎలా లింక్ చేయాలో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

IRCTC Araku Tour: అరకు టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీ మీకోసమే

Pension Alert: నవంబర్ 30 లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని పెన్షనర్లకు డిసెంబర్ నుంచి పెన్షన్ రాదు. రిటైర్ అయిన ఉద్యోగులు అంతరాయం లేకుండా పెన్షన్​ పొందాలంటే ఏటా నవంబర్​ 1 నుంచి నవంబర్​ 30 మధ్య బ్యాంకులకు లైఫ్​ సర్టిఫికెట్​ సబ్​మిట్ చేసుకోవచ్చు. పెన్షనర్ ఇంకా బతికే ఉన్నాడని సర్టిఫికేట్ రుజువుగా పనిచేస్తుంది.

Amazon Prime Membership: అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) మెంబర్‌షిప్ తీసుకోవాలంటే ఇకపై కాస్త ఎక్కువ ఖర్చు చేయాలి.

ప్రైమ్ మెంబర్‌షిప్ ధరల్ని ఏకంగా 50 శాతం పెంచింది కంపెనీ. కొత్త ధరలు డిసెంబర్ 14 నుంచి అమలులోకి వస్తాయి. డిసెంబర్ 14 నుంచి యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్‌కు రూ.1,499, మంత్లీ ప్లాన్‌కు రూ.179, క్వార్టర్లీ ప్లాన్‌కు రూ.459 చెల్లించాలి.

LPG Gas Cylinder Price: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డిసెంబర్ 1న గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. నవంబర్‌లో కమర్షియల్ సిలిండర్ ధరను రూ.266 పెంచాయి ఆయిల్ కంపెనీలు. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. మరి డిసెంబర్ 1న డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెరుగుతాయో, తగ్గుతాయో చూడాలి.

SBI ATM Card: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఉందా? లక్ష రూపాయల లోన్ ఇస్తున్న బ్యాంక్

Saudi Arabia: భారతదేశంతో పాటు మరో ఐదు దేశాలపై ట్రావెల్ బ్యాన్‌ను తొలగించింది సౌదీ అరేబియా. డిసెంబర్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుంది. ఆయా దేశాలకు చెందినవారు పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నట్టైతే డిసెంబర్ 1 నుంచి సౌదీ అరేబియాకు వెళ్లొచ్చు. 14 రోజుల క్వారెంటైన్ నిబంధనను కూడా తొలగించింది సౌదీ అరేబియా.

Income Tax Returns: 2021-22 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్స్ ఫైల్ చేయాల్సినవారికి 2021 డిసెంబర్ 31 వరకే గడువు ఉంది. ఒకవేళ అప్పట్లోగా రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఆ తర్వాత లేట్ ఫీజు చెల్లించి బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయల్సి ఉంటుంది.

Special Trains: ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. డిసెంబర్ 1 నుంచి 29 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. వీక్లీ పూజ స్పెషల్ ట్రైన్ పేరుతో వీటిని ప్రకటించింది ఈస్ట్ కోస్ట్ రైల్వే. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, సత్తెనపల్లి స్టేషన్లలో ఆగుతాయి.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Aadhaar Card, Aadhaar card, EPFO, Indian Railway, Indian Railways, IRCTC, IT Returns, LPG Cylinder, Lpg Cylinder Price, New rules, Railways, Special Trains, Train, Train tickets, Travel

ఉత్తమ కథలు