ENFORCEMENT DIRECTORATE RAIDS CHINESE PHONE MAKER VIVO OFFICES UNITS SEARCHES AT MULTIPLE PLACES MKS
Vivo | ED raids : వివో మొబైల్‌కు షాక్.. చైనీస్ కంపెనీపై ఈడీ దాడులు.. 44చోట్ల సోదాలు..
ప్రతీకాత్మక చిత్రం
చైనీస్ మొబైల్ ఫోన్ల కంపెనీ వివోకు కేంద్రం భారీ షాకిచ్చింది. వివో సంస్థకు చెందిన ఆఫీసులు, యూనిట్లపై కేంద్ర సంస్థ న్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులకు దిగింది.
ఇండియాలో విస్తృతంగా వ్యాపార కలాపాలు కొనసాగిస్తోన్న చైనీస్ మొబైల్ ఫోన్ల కంపెనీ వివో (Vivo)కు కేంద్రం భారీ షాకిచ్చింది. వివో సంస్థకు చెందిన ఆఫీసులు, యూనిట్లపై కేంద్ర సంస్థ న్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) దాడులకు దిగింది. మంగళవారం ఉదయం నుంచి వివో సంస్థకు చెందిన 44 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. (ED Raids on Chinese Vivo)
వివో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీ మొత్తంలో అక్రమ మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈడీ దాడులు చేసినట్లు తెలుస్తోంది. చైనాతో విభేదాల క్రమంలో ఆ దేశానికి చెందిన పలు కంపెనీలు, యాప్ లపై భారత్ నిషేధం విధించిన దరిమిలా ఇప్పుడు వివోపై ఈడీ దాడులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.
CM KCR : కేసీఆర్ వ్యూహం మారిందా? BRSకు బైబై.. TRSపైనే ఫోకస్ -20 నుంచి జిల్లాల పర్యటన!
వివో సంస్థ వందల కోట్ల మేర పన్ను ఎగవేతలకు పాల్పడిందని, వాస్తవ లెక్కలను దాచిపెట్టి తప్పుడు లెక్కలతో తక్కువ టాక్స్ చెల్లించినట్లు ఇంటెలిజెన్స్ ఇన్ పుట్ అందిన తర్వాతే ఈడీ అధికారులు నేరుగా దాడులకు పూనుకున్నట్లు సమాచారం. నిజానికి గత డిసెంబర్లో, ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ కూడా Vivo సంస్థకు చెందిన 20 చోట్ల సోదాలు చేసింది. ఆ సమయంలో వివోతోపాటు ఒప్పో, షామి, వన్ ప్లస్ వంటి ఇతర చైనా సంస్థల్లోనూ ఐటీ దాడలు జరిగాయి.
కొద్ది నెలల కిందటే ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ లేదా ఫెమా ఉల్లంఘనలపై షియోమీ ఇండియా హెడ్ మను జైన్‌ను కేంద్ర ఏజెన్సీ ప్రశ్నించింది. ఆ కేసులో ఈడీ రూ.5,000 కోట్ల విలువైన Xiaomi సంస్థ బ్యాంక్ ఖాతాలను అటాచ్ చేసింది. అయితే ఖాతాల జప్తును కర్ణాటక హైకోర్టు నిలిపివేసింది. ప్రస్తుతం వివో సంస్థకు సంబంధించి ఏవైనా ఆస్తులు లేదా ఖాతాలను అటాచ్ లేదా సీజ్ చేశారా అనేది తెలియాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.